Yatra 2 Twitter Review: జగన్ మూవీకి అలాంటి టాక్.. సినిమాలో హైలైట్స్ ఇవే.. మరి యాత్ర 2 హిట్టేనా అంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ మూవీల ట్రెండ్ నడుస్తోంది. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో వచ్చిన 'యాత్ర' ఒకటి.

ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవడంతో దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 'యాత్ర 2' మూవీని చేశారు. ఇది ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టోరీతో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన 'యాత్ర 2'కు ట్విట్టర్‌లో ఎలాంటి స్పందన వస్తుందో మీరే చూసేయండి మరి!

YS Jaganmohan Reddy Biopic Yatra 2 Movie Twitter Review

యాత్ర 2 అంటూ వచ్చారు: మలయాళ స్టార్ మమ్ముట్టి, జీవా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమే 'యాత్ర 2'. క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సీక్వెల్‌కు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు. ఇందులో రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ నటించారు.

YS Jaganmohan Reddy Biopic Yatra 2 Movie Twitter Review

అలాంటి కథతో వచ్చింది: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఏ పరిస్థితుల్లో పాదయాత్రను ప్రారంభించారు? చివరి ప్రజల మద్దతును కూడగట్టుకుని ఎలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అన్న అంశాలతో తెరకెక్కించిన చిత్రమే 'యాత్ర 2'. దీంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయన్న విషయం తెలిసిందే.

సినిమాలో అవి హైలైట్: జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు. ఈ మేరకు తన పోస్టులో 'యాత్ర 2 బ్లాక్ బస్టర్ మూవీ.. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. దర్శకత్వం కూడా సూపర్‌గా ఉంది. మహీ వీ రాఘవ్ వేరే లెవెల్‌లో సినిమాను తెరకెక్కించారు. తద్వారా మంచి అనుభూతిని అందించారు' అని చెప్పారు.

సినిమాకు అవే బిగ్ ప్లస్: పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన 'యాత్ర 2' మూవీని చూసిన మరో నెటిజన్ 'మహి వీ రాఘవ్ నుంచి మరో అద్భుతం. మమ్ముట్టి, జీవా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డైలాగులు పెద్ద బలంగా కనిపించాయి. సంతోష్ అందించిన మ్యూజిక్ బాగుంది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం ఎపిసోడ్‌తో సినిమా హై రేంజ్‌లో ఎండ్ అవుతుంది' అని చెప్పుకొచ్చారు.

తెలుగులో బెస్ట్ బయోపిక్: మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో జీవా, మమ్ముట్టి ప్రధాన పాత్రలు చేసిన 'యాత్ర 2' మూవీని వీక్షించిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'యాత్ర 2 తెలుగులోనే వచ్చిన బయోపిక్ చిత్రాలు అన్నింటిలోనూ బెస్ట్. నిజం చెబుతున్నాను' అంటూ రాసుకొచ్చారు.

అన్ని ఇండస్ట్రీల్లో బెస్ట్: 'యాత్ర 2' మూవీని చూసిన మరొక నెటిజన్ 'అన్ని ఇండస్ట్రీల నుంచి వచ్చిన బయోపిక్‌లో 'యాత్ర 2' బెస్ట్. సినిమా మొదలైనప్పటి నుంచే మీకు గూస్‌బమ్స్ వస్తాయి. మహీ వీ రాఘవ్ పేరు ఎప్పటికీ మర్చిపోరు. జగన్‌పై కాస్త ధ్వేషం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రేమగా మారింది. ప్రత్యర్థులకు కూడా గూస్‌బమ్స్ వచ్చేలా ఉంది. నా రేటింగ్ 3.5/5' అని వెల్లడించారు.

అట్టర్ ఫ్లాప్ మూవీ అని: 'యాత్ర 2' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ అసహనం వెల్లగక్కుతూ ట్వీట్ పెట్టాడు. అందులో 'యాత్ర 2 అట్టర్ ఫ్లాప్ మూవీ. ఈరోజు నుంచి సినిమాకు టికెట్లు ఫ్రీగా పంచుతారు. డబ్బా గాళ్లు, సొల్లు గాళ్లు, పబ్లిసిటీకి తప్ప ప్రజలకు సేవ చేయని పోరంబోకులు' అంటూ తీవ్రంగా దూషించాడు.

YS Jaganmohan Reddy Biopic Yatra 2 Movie Twitter Review

మొత్తంగా అలాంటి టాక్: 'యాత్ర 2' సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లను బట్టి దీనికి డీసెంట్ టాక్ వచ్చింది. అయితే, ఇది వైఎస్ కుటుంబ అభిమానుల నుంచి వచ్చినట్లు అర్థం అవుతుంది. ప్రత్యర్థి పార్టీల వాళ్లు మాత్రం ఈ చిత్రం బాలేదని చెబుతున్నారు. మరి రాను రానూ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మౌత్ టాక్ ఎలా వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X