వైయస్ జగన్ కు తులసి శాటిలైట్ హక్కులు?
వెంకటేష్ నటించిన కొత్త చిత్రం తులసి శాటిలైట్ హక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా పత్రికా, శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. జగన్ స్థాపించనున్న జగన్ టి వి చానెల్ కోసం తులసి హక్కులను కొన్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం రెండు కోట్లకు పైగా వెచ్చించినట్లు తెలిసింది. బాక్సాఫీస్ వద్ద వెనుకపడిన తులసి సినిమాకు జగన్ ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడం విశేషమే. శాటిలైట్ హక్కులకోసం ఒక సినిమాకు ఇంత పెద్ద మొత్తం వెచ్చించడం తెలుగు సినీ పరిశ్రమలో ఇదే మొదటిసారి కావడం మరో విశేషంగా చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











