ఆయన పోయాక కుటుంబాన్ని ఇలా... ‘యాత్ర’పై విజయమ్మ ఎమోషనల్

Recommended Video

Ys Vijayamma Emotional Comments On Yatra Movie | Mahi V Raghav | Mammootty | Filmibeat Telugu

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'యాత్ర'. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్‌కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూస్తూ చాలా మంది థియేటర్లో వైఎస్ఆర్ ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

తాజాగా 'యాత్ర' చిత్రాన్ని వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ వీక్షించారు. ప్రసాద్ లాబ్స్‌లో వేసిన ప్రత్యేక షోకు విజయమ్మ చిత్రం బృందంతో కలిసి హాజరయ్యారు. సినిమాచూసిన అనంతరం తన అభిప్రాయాలు మీడియాతో పంచుకున్నారు.

విజయవంతంగా నడిపిస్తున్నారు

విజయవంతంగా నడిపిస్తున్నారు

‘యాత్ర' వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి పాదయాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించి, విజయవంతంగా నడిపించిన డైరెక్టర్ మహి గారికి, విజయ్ చిల్లా గారికి, దేవిరెడ్డి శశి గారికి, శివ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమా తీసిన వారిని అభినందిస్తున్నాను అన్నారు.

వారి హృదయాలను తట్టిలేపారు

వారి హృదయాలను తట్టిలేపారు

కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రజల కోసం పడ్డ తపన, ఆశయాలు, సంక్షేమ పథకాలు మరోసారి ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లి వారి హృదయాలను ఈ సినిమా ద్వారా తట్టిలేపారని విజయమ్మ వ్యాఖ్యానించారు.

ఆయన పోయాక కూడా...

ఆయన పోయాక కూడా...

రాజశేఖర్ రెడ్డిగారిని 40 సంవత్సరాలు ఆదరించి ఏ విధంగా నాయకుడిగా నిలబెట్టుకున్నారో... ఆయన కూడా ఒక తండ్రిగా ఏమీ చేయాలో చేశారు. ఆయన వెళ్లిన తర్వాత రాజశేఖర్ రెడ్డిగారి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా వారి పిల్లలను కూడా అక్కున చేర్చుకున్నారు. ఈ సినిమాను ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు విజయమ్మ తెలిపారు.

ఆశ్రిత వేముగంటి

ఆశ్రిత వేముగంటి

రాజశేఖర్ రెడ్డిగారి జీవితంలోని అంశాలు తలుచుకుంటే అందులోని గొప్పతనం మనసుకు ఇంకా దగ్గరగా అనిపిస్తుంది. అలాంటి ఒక గొప్ప చరిత్రలో భాగం కావడం నా అదృష్టం. విజయమ్మగారి పాత్ర పోషించిన నేను ఈ సినిమాను ఆమెతో కలిసి చూడటం మరింత ఆనందంగా ఉందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X