వైయస్ సిన్మా ఇక లేనట్టేనా?

మరో ప్రక్క ఆయన ఇష్టపడి ప్రారంభించిన టీ..బిస్కట్..సమోసా సినిమా ఆగిపోయింది. మరో ప్రక్క విజయవాడలో ఆయన ప్రారంభించిన రియల్ ఎస్టేట్(అపార్ట్ మెంట్స్) వెంచర్ విజయవంతం కాలేదని సమాచారం. ఆయన గతంలో ప్రారంభించిన మొబైల్ ఫుడ్ సప్లయ్ ప్రాజెక్టు కూడా పడుకుంది. ఆయన నడుపుతున్న పత్రిక 'ఈభూమీ కూడా అంతంతమాత్రంగా నడుస్తోంది. ప్రధానంగా ఎడ్యుకేషన్ బిజినెస్ లో ఉన్న సిసి రెడ్డికి ఆర్ధిక మాంద్యం దెబ్బ తగిలింది. విదేశాల్లో విద్యావకాశాలు కల్పించే "విసు" సంస్ధకు ఇప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ సందేహమేనంటున్నారు.
అందులోనూ రిలీజ్ కి ఎలక్షన్ కమీషన్ సైతం ఒప్పుకునే స్ధితిలో లేదు. ఇక ఈ చిత్రంలో ఇక ఈ సినిమా లో బ్రహ్మానందం ట్రైబర్ గ్రామాలనుంచి వచ్చి ముఖ్యమంత్రిని కలసి తమ కష్టాలు చెప్పుకుంటుంది. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటం,ప్రభుత్వ పథకాల గొప్పతనం ఇందులో ఉంటుంది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ లా కామెడీని ఇన్సఫైర్ అయి చేసారని టాక్. అలాగే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో తమ్ముడు చిత్రం రూపొందించిన అరుణ్ ప్రసాద్ డైరక్ట్ చేస్తున్నారు. అరుణ్ ప్రసాద్ గతంలో సి.సి.రెడ్డి నిర్మాతగా గౌతమ్ ఎస్.ఎస్.సి అనే సినిమాను తీసి ఉన్నాడు. అయితే అరుణ్ ప్రసాద్ మాత్రం చక్కగా ఈ చిత్రం ఊసు ఎత్తకుండా నవదీప్, భూమిక కాంబినేషన్ లో యాగం చిత్రం చేయటంలో బిజీ అయిపోయారు.


Click it and Unblock the Notifications











