సినీ లవర్స్ కి వైయస్ మళ్ళి ట్విస్ట్!

ఇక సినీరంగ ఆరాధ్యులైన బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డిల పేరిట జాతీయ అవార్డులు ప్రవేశపెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన నంది అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సినీ పరిశ్రమకు అన్నివేళలా, అన్నిరకాల తోడ్పాటును అందిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. పరిశ్రమ మద్రాస్ నుంచి రాష్ట్రానికి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే చాలా కృషి చేశాయన్నారు. తాజాగా విశాఖపట్నంలో కూడా చిత్ర పరిశ్రమ వేళ్లూనుకుంటుందని తెలిపారు. సినీ పరిశ్రమ బలపడేందుకు ప్రతి అంశంలోనూ తోడ్పాటును అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరింత మేలు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్లాబ్ విధానం తొలగించి సినీ పరిశ్రమ నిలదొక్కుకునేలా చేశామన్నారు. ఎన్ని చెప్పినా టిక్కెట్ రేటు మళ్ళి పెర్గుతుందనే వార్త దగ్గరే చూడ్డానికి వచ్చిన జనం ఆగిపోయారు. అది సంగతి.


Click it and Unblock the Notifications











