వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’.... కేవీపీ పాత్రలో ఆ ప్రముఖ నటుడు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' పేరుతో రాబోతున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాల సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తి, ఆయన ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు. మా ఇద్దరిదీ ఒకే ఆత్మ అని వైఎస్ఆర్ బ్రతికున్న సమయంలో ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇలాంటి కీకలమైన పాత్రలో ఎవరు నటించబోతున్నారు? అనే ఆసక్తి అందిరిలోనూ ఉంది. ఈపాత్రకు నటుడు ఖరారైనట్లు దర్శకుడు ప్రకటించారు.
Recommended Video


కేవీపీ పాత్రలో రావు రమేష్
వైఎస్ జీవితంలో అత్యంత కీలకమైన కేవీపీ రామచంద్రరావు పాత్రకు ప్రముఖ తెలుగు నటుడు రావు రమేష్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు మహి రాఘవ్ ఖరారు చేశారు. సినిమాలో మమ్ముట్టి, రావు రమేష్ మధ్య కీలకమైన సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలిపారు. విజయ్మ పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

వైఎస్ జగన్ పాత్రలో ఎవరు?
ఈ చిత్రంలో వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ పాత్ర కోసం తమిళ హీరో సూర్యను సంప్రదించినట్లు తెలుస్తోంది.

సినిమాలో చూపించేది ఎక్కువ భాగం అదే
యాత్ర' సినిమాలో ఎక్కువగా వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రను ఫోకస్ చేయబోతున్నారు. ‘భలేమంచి రోజు', ‘ఆనందో బ్రహ్మ' లాంటి విజయవంతమైన సినిమాలు తీసిన విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి.వి.రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

జూన్ నుండి షూటింగ్
ఏప్రిల్ నుండే ఈ షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది. పలు కారణాలతో షూటింగ్ ఆలస్యం అయింది. జూన్ 15 నుండి సినిమా మొదలు పెట్టి ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్సాన్స్ వచ్చింది.

హైలెట్ అయ్యే అంశాలు
వైఎస్ఆర్ 60 రొజుల్లో 1500 కిలోమీటర్లు కాలి నడకతో కడప దాటి ప్రతి ఇంటి గడప లొకి వెళ్ళి పెదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ళ భాదల్ని, రైతుల ఆవేదనని కళ్లారా చూశారు. వారి కష్టాల్ని తన కళ్ళతో చూసిన ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత కరెంటు, విద్యార్థులకి ఫీజు రీ-ఎంబార్సిమెంట్, పేదవారికి ఆరోగ్య శ్రీ లాంటి పథకాలతో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారు. ఇవన్నీ సినిమాలో హైలెట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











