వైయస్ సపోర్ట్ తో 'కింగ్' హ్యాపి

ఓ ప్రక్క కాంగ్రేస్ తో సపోర్టు విషయం ఎత్తకుండానే భలే తెలివిగా ఉపకారం పొందాడు నాగార్జున అని అంటున్నారు.ఇక ఈ విషయంపై కింగ్ యూనిట్ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని,తమ సినిమాకి మంచి లాభాలు సంపాదించపెట్టడానికి రియల్ హీరోలా నాగార్జున సాయపడ్డారని వాళ్ళు వేనోళ్ళ పొగుడుతున్నారని చెప్తున్నారు. తన సినిమాకే ఇలా చేసుకుంటే రాబోయే కొడుకు తెరంగ్రేటం సినిమాకు ఏ రీతిలో మార్కెటింగ్ ఏర్పాట్లు చూస్తాడో అని నాగార్జున బిజినెస్ నాలెడ్జ్ ని అంచనా వేస్తున్నారు. పాపం వెంకటేష్ కే అన్యాయం జరిగిందని,అతని చింతకాయలరవి రిలీజ్ కి టిక్కట్ రేటు తగ్గించటం తో నష్టపోవటాన్ని ప్రస్ధావిస్తున్నారు. అయినా నాగార్జునకే ఉపకారం చేసినా చాలా మంది పెద్ద నిర్మాతలకు లాభం చేకూరుతుంది కాబట్టి నొ కామెంట్ అంటున్నారు. కరెక్టే కదా.


Click it and Unblock the Notifications











