వైఎస్ ఆర్ తో నా అదృష్టం... బ్రంహ్మీ
రాజకీయల్లోనే కాదు...రియల్ గా కూడా డా. రాజశేఖరరెడ్డి గారు హీరోనే. ఆయనతో కలిసి నేను నటిస్తున్న చిత్రం షూటింగ్ లో నాకు చాలా సాన్నిహిత్యం పెరిగింది ఆయన ఇంతవరకు ఎప్పుడూ కెమెరా ముందు నటించకపోయినప్పటికీ చాలా సింపుల్ గా, సింగిల్ టేక్ లో ఒకే చేసేవారు. డా.రాజశేఖరరెడ్డి గారితో కలిసి నటించే అదష్టం నాకు మాత్రమే లభించడం నిజంగా నా అదృష్టం. ఈ రోజు ఆయన లేరు అని తలచుకుంటే అది అబద్ధం అయితే ఎంత బాగుండును అనిపిస్తోంది. బుధవారం టివిలో సియం మిస్సింగ్ అన్న వార్త విన్న దగ్గర నుంచి ఆయనకేం కాకూడదు, క్షేమంగా తిరిగి వస్తారనే పూర్తి విశ్వాసం ఉండేది. ఆచూకీ ఆలస్యం అయినకొద్దీ టెన్షన్ పెరుగుతూ వచ్చింది అని బ్రహ్మానందం తన బాధను వ్యక్తం చేసారు.
గురువారం సియం జాడ తెలిసింది అన్న వార్త విని ప్రాణం లేచొచ్చింది. అంతలోనే సియం ఇకలేరు లని తెలిసి గుండె చరువయ్యింది. ప్రజల కోసం ఏమిచేద్దాం అని ఎప్పుడూ ఆలోచించే ఇటువంటి డైనమిక్ లీడర్ మళ్ళీ పుట్టడేమో అనిపిస్తుంది. రాజకీయాలపై ఆయనకున్న ఆసక్తి, కమిట్ మెంట్ మరెవ్వరిలోనూ చూడలేం.
ఒక విద్యార్థి ఐఎయస్ కావాలంటే ఎంత కష్టపడతాడో సియం అవడానికి ఆయనంత కష్టపడ్డారు. అనుకున్నది సాధించే వరకు ఆయన నిద్రపోరు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని ఒకే ఒక్కడుగా అధికారం కట్టబెట్టారు. హీ ఈస్ ది గ్రేట్.......వైఎస్ ఆర్ నిజంగా రియల్ హీరో. మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం పెట్టి మాట తప్పని ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. కోటీశ్వరులకు మాత్రమే సాధ్యమయ్యే కార్పొరెట్ వైద్యం పేదలకు అందించిన దేవుడాయన. జలయ్గ్న్, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, ఇందిరా వికాస్ యోజన, కార్పొరేట్ విద్య....ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రజల కోసం చేసిన మంచి అంతా ఇంతా కాదు.
అందుకే ఆయన ప్రజలమనిషిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇంత మంచి మనిషి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన అకాల మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను...అని డా.వై.ఎస్ రాజశేఖరరెడ్డితో కలిని ఒక మూకీ చిత్రంలో నటించిన ప్రముఖ హాస్యనటులు డా. బ్రహ్మానందం అన్నారు.


Click it and Unblock the Notifications











