ప్రభాస్‌-వినాయక్‌ల సిన్మాకు చీఫ్‌ గెస్ట్‌ వైఎస్‌

By Staff

సినిమా ఫంక్షన్లకు సాధారణంగా దూరంగా ఉండే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ సినిమాను ఆయన సమీప బంధువు, కడప మేయర్‌ పి. రవీంద్రారెడ్డి నిర్మిస్తుండడమే దీనికి కారణం. ప్రభాస్‌ హీరోగా వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ ఏడున శ్రీరామనవమి ఘడియలు ముగిసిన తర్వాత దశమి నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రారంభ షాట్‌కు ఒకనాటి హీరో, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తారు. హీరో వెంకటేష్‌ స్విచాన్‌ చేస్తారు.

ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన నయనతార నటిస్తుండడం ఒక హైలైట్‌. త్రిష తర్వాత నయనతార తెలుగు సినిమా నిర్మాతలకు అదృష్ణ చిహ్నంగా మారింది. ఈ సినిమాకు బస్వ అనే టైటిల్‌ పెట్టాలని భావిస్తున్నారు. కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన బస్వకు ఇది ఫ్రీమేక్‌. నిర్మాతలు పి.చంద్రప్రతాప్‌రెడ్డి, పి.సుదర్శన రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X