ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై స్పందించిన వైసీపీ.. చంద్రబాబు, లోకేష్‌ను ఏకిపారేసిన ఏపీ సర్కార్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణంపై వస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తమ పార్టీపై తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, నారా లోకేష్ చేసిన ట్వీట్లపై ఫైర్ అయింది. శ్యామ్ మరణంపై కోనసీమ ఎస్పీ శ్రీధర్ వెల్లడించిన పోస్టు మార్టమ్ రిపోర్టును, శ్యామ్ తన మరణానికి ముందు పోస్టు చేసిన వీడియోలను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. వైసీపీ ఎలాంటి రియాక్షన్ ఇచ్చింది. తన వీడియోలో శ్యామ్ ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..
వ్యక్తిగత కారణలతో కోనసీమ జిల్లాకు చెందిన 20 ఏళ్ళ యువకుడు శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఊరి వేసుకోవడం వల్లే శ్యామ్ మృతి చెందినట్టు పోస్టుమార్టంలో తేలిందని కోనసీమ జిల్లా ఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు. అయినప్పటికీ ఈ విషయాన్ని
@ncbn, ప్రతిపక్షాలు రాజకీయం చేయడం వారి వక్రబుద్ధికి నిదర్శనం. సీఎం @ysjagan గారిని నేరుగా ఎదుర్కోలేక చివరికి ప్రజల మరణాలను కూడా తమ స్వలాభాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి నాయకులు దేశంలో మరెక్కడా ఉండరేమో!

సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో!
శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻 శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఈ ఘటన ని రాజకీయంగా వాడుకోవాలని @ncbn @Naralokesh లాంటి నీచ రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ఇది చాలా బాధాకరం.
దయచేసి రాష్ట్ర ప్రజలంతా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారు @JaiTDP & @JanaSenaParty నాయకులు. కావున రాష్ట్ర ప్రజలందరూ జగ్రత్తగా ఉండండి అంటూ పోస్టులో తెలిపింది.
అయితే వైసీపీ అధికార ట్విట్టర్‌లో శ్యామ్ మాట్లాడిన వీడియోల్లో.. మమ్మీ సారీ.. డాడీ సారీ.. నేను ఉన్నా లేకపోయినా ఒకటే. నేను ఉన్నా మీకు లాభం లేదు. వచ్చే జన్మంటూ ఉంటే మళ్లీ మీ కడుపున పుడుతాను. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను జాబ్ చేయలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాను. మిస్ యూ మమ్మీ అంటూ శ్యామ్ మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











