రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం.. కేంద్రమంత్రిగా ఏం చేశారు.. చిరంజీవిపై పేర్ని నాని ధ్వజం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడిన విషయాలపై ఏపీ ప్రభుత్వ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. చిరంజీవి మాట్లాడిన విషయాలు ఏమిటి? పేర్నీ నాని స్పందించిన తీరు ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా చిరంజీవి చురకలు అంటిస్తూ.. ప్రభుత్వం, ప్రభుత్వ అధినేతలు, అధికారులు పెద్ద పెద్ద విషయాలపై దృష్టిపెట్టాలి. మంచి ఫలితాలు రప్పించేలా పనిచేయాలి. ప్రత్యేక హోదా, లేకపోతే నీటి ప్రాజెక్టుల గురించి కానీ, లేదా రోడ్ల నిర్మాణాల గురించి కానీ, లేదా పేదవాళ్ల కడుపు నింపే పథకాలపై దృష్టిపెట్టాలి.

ఇంకా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం గానీ చేయాలి ఉపాధి అవకాశాలు గానీ, ఇతర అభివృద్ధి అంశాలపై దృష్టిపెడితే ప్రజలు, ప్రపంచం హర్షిస్తుంది. అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడితే ఎలా. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోవాలి అని చిరంజీవి తన ప్రసంగంలో ఘాటుగా స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవికి నేను అభిమానిని. చదువుకొనే రోజుల్లో బ్యానర్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. చదువు కోసం పక్క రాష్ట్రం వెళ్లినా అక్కడ కూడా సినిమా హాళ్ల వద్ద చిరంజీవి పోస్టర్‌కు దండలు వేశాం. ఒకవేళ ఏపీ ప్రభుత్వంపై నా అభిమాన హీరో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే.. మేము కూడా అదే రితీలో స్పందిస్తాం. హైదరాబాద్‌లో ఫిలిం నగర్ నుంచి ఏపీ సచివాలయం వరకు ఎంత దూరం ఉంటుందో.. ఏపీ సచివాలయం నుంచి ఫిలిం నగర్‌కు అంతే దూరం ఉంటుంది అని పేర్ని నాని అన్నారు.

చిరంజీవికి గారికి ఒకే విన్నపం చేసుకొంటున్నాను. ధృతరాష్ట్రుడికి ద్రౌపదికి ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమే మాకు కూడా ఉంటుంది. ఆ సమయంలో ఆ ప్రేమ సమాజానికి ఎలా నష్టం చేసిందో.. ఈ రోజు అలాంటి నష్టమే సమాజానికి చేస్తున్నది. సినిమాను సినిమాగా చూడాలి అని పేర్ని నాని అన్నారు.
మేము ఎప్పుడైనా చిరంజీవి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్, చిరంజీవి మేనల్లుళ్లు, లేదా రవితేజ గురించి ఏనాడైనా ఒక్క మాట అన్నామా? చెప్పాలని పేర్ని నాని అన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మా మంత్రి ప్రజలను సంతోష పెట్టడానికి డ్యాన్స్ చేస్తే.. అలాంటి డ్యాన్స్‌ను సినిమాలో పెట్టి అవహేళన చేస్తారా? తమిళ సినిమాల్లో లేకున్నా.. కథకు సంబంధం లేకున్నా.. ఒక నటుడి ప్రవేశ పెట్టి.. ఈ రాష్ట్రంలో ఒక నాయకుడిని కించపరిచే విధంగా.. కావాలని ఆ సీన్ పెట్టాడం తప్పు కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ.. ఓ సినిమాలో ప్రకాశ్ రాజ్ డైలాగ్ చెప్పినట్టు.. మీరు గిల్లితే.. మేము గిల్లుతాం అని పేర్ని నాని అన్నారు. మేము ఏ హీరో, డైరెక్టర్ గురించి మాట్లాడారా? చిరంజీవి, రాంచరణ్, మహేష్ బాబు, రవితేజ రెమ్యునరేషన్ గురించి మేము ప్రశ్నించామా?. మా రాజకీయ నేతను కించపరిచే విధంగా సీన్లు పెట్టినందుకు ఆ హీరో రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించాం అని పేర్ని నాని అన్నారు.
చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది. రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ సమయంలో ప్రత్యేక హోదా గురించి చట్టంలో పెట్టకుండా రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పుడు నా అభిమాన హీరో ఎక్కడున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు అని పేర్ని నాని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











