ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని.. జీలో దమ్ముందా? చంద్రబాబుది నాకుతున్నావా?.. అశ్వినీదత్‌పై పోసాని బూతు పురాణం
వైసీపీ నేత, నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ అసభ్య పదజాలంతో నిర్మాత అశ్వినీదత్‌పై రెచ్చిపోయారు. మే డే సందర్భంగా నిర్మాతల మండలి నిర్వహించిన సమావేశంలో నంది అవార్డుల ప్రస్తావన రాగా.. అశ్వినీదత్ స్పందించారు. ప్రస్తుత సీజన్ వేరేలా నడుస్తున్నది. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. నంది అవార్డులకు సమయమెక్కడిది అంటూ కామెంట్ చేశారు. నిర్మాత అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలపై పోసాని స్పందిస్తూ..
ఉత్తమ గురికాడు అవార్డును ఇవ్వాలి అంటూ: స్వర్గీయ ఎన్టీఆర్‌ను గురిచూసి చెప్పుతో కొట్టారో..ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని నీచాతినీచంగా తిట్టినందుకు మీకు ఉత్తమ గురికాడు అని అవార్డు ఇవ్వాలి. ఆడవాళ్లను వాడేసుకొని చాలా చాలా పనులు చేయించుకొన్నవాళ్లు మీ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ల గురించి మీరు చెప్పాలి అన్న. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో తక్కువ ధరకు పొలాలు కొని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే.. ఆ పొలాలు ప్రభుత్వం తీసుకొని..సెంట్రల్‌లో వాళ్లకు భూములు ఇచ్చారట. అట్లాంటి వాళ్లకు ఉత్తమ లోఫర్ అవార్డులు ఇవ్వాలి అని పోసాని అన్నారు.

ఏ కులాన్నైనా అణగదొక్కాడా?: దత్తన్న.. మీరు జగన్ ప్రభుత్వంపై ఎందుకు ఏడుస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా ఆయన వెన్నుపోటు పొడిచాడా? ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని పైపైకి ఎగబాకాడా? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులైనా చేశారా? ఏ కులాన్నైనా అణగదొక్కే ప్రయత్నం చేశారా? అలాంటి వాటిని జగన్ చేస్తే.. మీ ఆఫీస్‌కు వచ్చి చెప్పుదెబ్బలు తింటాను. ఏ రోజు రామారావును వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పుతో కొట్టారో.. ఆ రోజున మీరు కంటతడి పెట్టారా అని పోసాని ప్రశ్నించాడు.

నీ జీలో దమ్ముందా?: రామారావును చెప్పుతో కొడుతావని ప్రశ్నిస్తే నీవు మనిషివి. రామారావును వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాగేసుకొంటే, వాళ్లను ఒక్క మాట అనలేదు. ఆ రోజు నీవు ఏమైనా అని ఉంటే మనిషిగా బతికి ఉండేవాడివి. రామారావుకు విలువలు లేవని చంద్రబాబు అన్నప్పుడు.. నీ జీలో దమ్ముండి.. రామారావుకు విలువలు ఉన్నాయని అంటే నీ కాళ్లకు దణ్ణం పెట్ట ఉండేవాడిని అని పోసాని కృష్ణమురళీ నిలదీశాడు.

నీ సెటైర్లు మాకు తెలియదా?: నీకు కావాలంటే చంద్రబాబుది నాకు. మాకేమి అభ్యంతరం లేదు. కానీ అకారణంగా సీజన్ నడుస్తున్నది. ఉత్తమ గుండా.. మీ 50:50 రెమ్యునరేషన్లు.. నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. నీ సెటైర్లు ఏమిటో తెలియదా? నీకు బుద్ది ఉందా? తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ గుండా అని అవార్డు ఇచ్చారా? అని పోసాని కృష్ణ మురళీ ప్రశ్నించాడు.

వైఎస్ జగన్‌ను అనలేదా? మరెవర్నీ..?: అయితే ఉత్తమ గుండా అని జగన్ బాబును అనలేదు. మరి ఎవర్ని ఉద్దేశించి అన్నావు. ఉత్తమ గుండా, రౌడీ అవార్డులు ఇస్తారా? నీకే తెలుసా చీప్ టాక్నిక్స్. ఇన్ని ఏళ్లు వచ్చాయి. ఇకనైనా నీతితో బతుకు. కొంచమైన నీతితో బతుకు అని సలహా ఇస్తున్నాను. నీకు నేను వ్యక్తిగతమైన సలహాలు మాత్రమే ఇస్తున్నాను అంటూ పోసాని బూతు పురాణం అందుకొన్నాడు.


Click it and Unblock the Notifications











