For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  PVP లోకేశ్వరుడికి తప్ప.. లోకానికి భయపడం.. డీకే అరుణ కూతురికి పీవీపీ ఘాటైన కౌంటర్

  |

  వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) తనపై డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి దాఖలు చేసిన కేసుపై స్పందించారు. ప్రేమ్ పర్వత్ గేటెడ్ కమ్యూనిటీలో చోటుచేసుకొన్న వివాదంపై తన వివరణను పీవీపీ ఘాటుగా ఇచ్చారు. తాను గానీ, తన సిబ్బంది గానీ ఎలాంటి తప్పుు చేయలేదు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి తమ సిబ్బంది పనులు చేశారు. కానీ శృతిరెడ్డి అసభ్య పదజాలంతో మా సిబ్బందిని తిట్టారు అంటూ పీవీపీ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వివాదంపై పీవీపీ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  నాపైనే కేసులు ఎందుకో..

  నాపైనే కేసులు ఎందుకో..

  బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి ఫిర్యాదుపై స్పందిస్తూ.. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నానని ఆరోపిస్తున్నారు. కరోనావైరస్ కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. గతేడాది పీవీపీ తన అనుచరులు, గుండాలతో దాడి చేశారని కేసు పెట్టారు.

  నేను ఇంట్లో లేనప్పడు.. పోలీసులపై కుక్కలను వదిలారని నా ఫ్యామిలీపై కేసులు పెట్టారు. గత నాలుగు వారాలుగా నా ఫ్యామిలితో కలిసి నేను గోవాలో ఉంటున్నాను. నాపై కేసు నమోదైందని నాకు ఇప్పుడే తెలిసింది. నాపై, సిబ్బందిపై కేసు పెట్టారని చెప్పారు. ఇటీవల కాలంలో నాపై కేసులు విపరీతంగా పెడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదు.

  తప్పు చేస్తే తరిమి కొట్టండి అంటూ పీవీపీ

  తప్పు చేస్తే తరిమి కొట్టండి అంటూ పీవీపీ

  మేము తప్పు చేస్తే కేసు కాదు.. మా సిబ్బందిని, మా సంస్థ ఉద్యోగులను తరిమి కొట్టండి. నేను గానీ, మా సిబ్బంది గానీ ఎలాంటి తప్పు చేయలేదు. నేను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తిని. 10 ఏళ్లకుపైగా కేసులు పెడుతూ.. సీబీఐ విచారణ జరిపించారు. వాటిలో ఎలాంటి తప్పు చేయలేదని బయటపడిన ఏకైక వ్యక్తిని నేను అంటూ పీవీపీ వీడియోను రిలీజ్ చేశారు.

  మా సిబ్బందిపై దాడి చేశారంటూ

  మా సిబ్బందిపై దాడి చేశారంటూ

  మా సంస్థ ఎన్నో వెంచర్స్ వేసింది. ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదు. తప్పు చేసిన వారిని తప్పు అనడం మా తప్పు అయితే ఏం చేయలేదు. నిన్న ప్రేమ్ పర్వత్ గేటేడ్ కమ్యూనిటీలో జరిగిన విషయాలను సీసీటీవీ ఫుటేజ్‌లో చూశాం. మాపై ఫిర్యాదు చేసిన వారు.. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. మా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు అని పీవీపీ చెప్పారు.

  హైకోర్టు ఆదేశాలతోనే పనులు

  హైకోర్టు ఆదేశాలతోనే పనులు

  డీకే అరుణ కూతురు ఇంటికి సంబంధించిన వ్యవహారంలో మేము హైకోర్టు ఆర్డర్ ద్వారా మా ఇంటి పనులు చేయించుకొన్నాం. ముందే పోలీసులకు సమాచారం అందించాం. మా సిబ్బంది పనిచేస్తుంటే.. మాటల్లో చెప్పలేకుండా సిబ్బందిని దుర్బాషలాడారు. పొట్టకూటి కోసం వచ్చే సిబ్బందిని నానా బూతులు తిట్టారు. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా తిట్టారు. ఇలాంటి కేసులు పెడితే భయపడేది లేదు అని పీవీపీ చెప్పారు.

   మీడియా వార్తలు రాస్తే భయపడను..

  మీడియా వార్తలు రాస్తే భయపడను..

  సమాజంలో పేరు, పలుకుబడి ఉందని భావిస్తే తప్పు. తప్పు చేయడమే కాకుండా మాపై కేసులు పెడుతున్నారు. సొసైటీ ఏదో అంటే.. మీడియా వార్తలు రాస్తే భయపడే సమస్యే లేదు. డెక్కన్ క్రానికల్ లాంటి సంస్థ వేల కోట్లు ఎగవేతకు పాల్పడ్డారు. అలాంటి మీడియా వార్తలు రాస్తే భయపడను. మాకు అప్పులు ఎగ్గొట్టారు. మాపై కేసులు వందైనా పెట్టండి.. భయపడేది లేదు అని పీవీపీ అన్నారు.

  దేవుడికి తప్ప ఎవరికి భయపడేది లేదు..

  దేవుడికి తప్ప ఎవరికి భయపడేది లేదు..

  మీడియాకు, రాజకీయ నేతలకు భయపడేది లేదు. లోకేశ్వరుడికి తప్పితే లోకానికి భయపడేది లేదు. దేవుడికి తప్ప నేను ఎవరికి భయపడను. చట్ట ప్రకారమే మేము మా పనులు చేసుకొన్నాం. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. మేము ఎక్కడ ఉన్నామో సెల్‌ఫోన్ బట్టి తెలుసుకోవచ్చు. సీసీటీవీ ఫుటేజ్ చేస్తే ఎవరు ఎలా మాట్లాడారో తెలుస్తుంది. ఎవరికో భయపడి ఈ వివరణ ఇవ్వలేదు. నా సన్నిహితులు అడిగినందుకు చెప్పాల్సి వస్తున్నది. మాకు న్యాయం జరిగేందుకు అధికారులను కలుస్తాం అని పీవీపీ చెప్పారు.

  English summary
  BJP top Leader DK Aruna daughter Shruti Reddy files case on YSRCP leader, Producer PVP. She filed case at Banjara Hills police station. But PVP condemns Shruti Reddy allegations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion