MRO ఆయన మూడు పెళ్లిళ్ల సినిమా తీస్తున్నాం.. పవన్ కల్యాణ్‌పై విరుచుకు పడ్డ అంబటి.. MRO అంటే ఏమిటంటే?

బ్రో సినిమాలో తనపై సెటైర్లు వేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు సినిమా రంగంలో అనుభవం లేదు. కానీ గతంలో డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేశాం. కానీ కొంత మంది కలిసి ఓ వ్యక్తి జీవితంపై నలుగురైదుగురం కలిసి సినిమా చేయాలని అనుకొంటున్నాం అని అంబటి రాంబాబు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కానీ పవన్ కల్యాణ్ మాత్రం సినిమాలు వదలక, రాజకీయాలు వదల్లేని సందిగ్దంలో ఉన్నాడనే స్పష్టం. మేము రాజకీయాల్లో ఉన్నాం. పది మంది కలిసి సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నాం. ఆ సినిమా ఏమిటి? దాని కథా వస్తువు ఏమిటి? అనేది మీ ద్వారా తెలుగు ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాను.

YSRCP Minister Amabti Rambabu going to become producer of MRO, Satires on Pawan Kalyan!

మా కథా నేపథ్యం ఏమిటంటే.. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఓ రంగంలో పెద్ద స్థాయికి చేరుకొంటారు. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి.. చదువు అబ్బక.. అక్కడక్కడ తిరుగుతూ.. తప్పిపోతు ఉంటాడు. ఆ వ్యక్తికి మంచి స్థాయిలో ఉన్న అన్నయ్య హిత బోధ చేస్తాడు.

కానీ అన్నయ్య రంగంలో ఉండనని, అన్నల్లో కలుస్తానని అంటూ తిరుగుతుంటే.. తన రంగంలోకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి అన్నయ్య పెడుతాడు. దాంతో ఆ వ్యక్తి తన రంగంలో అద్బుతమైన విజయాలు సాధించి అన్నయ్యను మించిన తమ్ముడు అవుతాడు. ఎక్కడికెళ్లిన అద్బుతంగా ఉపన్యాసాలిస్తుంటాడు. దేశం గురించి, సమాజం గురించి కథలు చెబుతాడు. అది ఆయన బయటి రూపం.

కానీ ఆయనలో వేరే కోణం ఉంటుంది. యుక్త వయసులో పెళ్లి చేస్తే విడాకులు జరిగాయి. మొదటి భార్య ఉండగానే రెండో భార్యతో పిల్లలు కంటాడు. రెండో భార్య ఉండగానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకొంటాడు. మూడో భార్యతో ఉండగానే నాలుగో భార్య ఇలా.. పెళ్లిళ్ల కథ కొనసాగుతుంది. చివరకు అందరూ భార్యలు, పిల్లలు కలిసి ఆ వ్యక్తికి గుణపాఠం చెబుతారు.

మేము తీయబోయే సినిమాకు టైటిల్స్ కూడా పెట్టాం. పెళ్లి పెటాకులు, MRO (Marriage, Relations, Offender), మూడు మూళ్లు ఆరు పెళ్లిళ్లు..నిత్య పెళ్లి కొడుకు, తాళి ఎగతాళి, బహు భార్య ప్రవీణ్యుడు లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మీలో ఎవరైనా మించి టైటిల్ సూచిస్తే వాటిని పరిశీలనలోకి తీసుకొంటాం. నేను చెప్పిన తర్వాత ఆ కథ పవన్ కల్యాణ్‌దని భావిస్తే మీరు భావించుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంబటి రాంబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X