చిరంజీవిని తిడితే ఏం జరుగుతుందో మాకు తెలుసు.. శ్రీరామా అంటే వారికి నీ యమ్మా అంటూ కొడాలి నాని వివరణ

వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజుల ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. భారీ విజయాన్ని అందుకొన్న ఈ సినిమా వేడుకను ఇటీవల హైదరాబాద్‌లో రవితేజ, నిర్మాతలు నవీన్, రవిశంకర్, దర్శకుడు బాబీ, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు సమక్షంలో నిర్వహించారు. అయితే ఈ వేడుకలో తెలుగు సినిమా హీరోలు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ల గురించి పార్లమెంట్‌లో చర్చించడంపై చిరంజీవి తప్పుపట్టారు. ఆ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..

పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన సినిమాటోగ్రఫి చట్టం బిల్లు సందర్భంగా కొందరు ఏపీ ఎంపీలు తెలుగు సినిమా పరిశ్రమలోని హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది. ఆ సమస్యలను ప్రస్తావించకుండా సినిమా హీరోల రెమ్యునరేషన్ల గురించి మాట్లాడం కరెక్ట్ కాదు అని చిరంజీవి అన్నారు.

Chiranjeevi

ఏపీలో ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ తదితర అంశాలు ఉన్నాయి. వాటిని వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మస్త్రం మాదిరిగా మా హీరోల రెమ్యునరేషన్ల గురించి ఎందుకు మీకు ఇంత ఆసక్తి. రాష్ట్ర సమస్యలపై మీరు దృష్టిపెట్టండి. రాజకీయ నేతలు సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటూ చిరంజీవి కామెంట్ చేశారు.

అయితే చిరంజీవి చేసిన కామెంట్లను గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకెళ్లగా.. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడి గాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఎలా ఉండాల్లో వాళ్లు మాకు సలహాలు ఇస్తున్నారు. మనకెందుకు రాజకీయాలు, డ్యాన్సులు, ఫైట్లు చేసుకోకుండా అని అలాంటి పకోడి గాళ్లకు చెప్పుకోవాలి అని కొడాలి నాని అన్నారు. దాంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా చిరంజీవి అభిమానులు రోడ్లపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని అంతు చూస్తామని హెచ్చరించారు.

 YSRCP MLA Kodali Nani clarity on comments Chiranjeevi remarks on AP Special Status and Polavaram

చిరంజీవి ఫ్యాన్స్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కొడాలి నాని తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని వెల్లడించారు. మేము శ్రీరామా అంటే నీ యమ్మా అంటారు. గుడివాడలో ధర్నాలు చేసింది చిరంజీవి ఫ్యాన్సా? రావి వెంకటేశ్వరరావు చిరంజీవి అభిమానా? చిరంజీవిని వదిలేసి తిరిగేవాళ్లు ధర్నాలు, ఆందోళనలు చేస్తే ప్రయోజనం ఏమిటి అని కొడాలి నాని ప్రశ్నించారు.

 YSRCP MLA Kodali Nani clarity on comments Chiranjeevi remarks on AP Special Status and Polavaram

సినిమా పరిశ్రమలో కొందరు పకొడి వెధవలు ఉన్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారు. అలాంటి పకోడి గాళ్లకు ఆయన కూడా సలహాలు ఇవ్వాలని కోరాను. డ్యాన్సులు, ఫైట్లు రాని పకొడి గాళ్ల అని అన్నాను. చిరంజీవికి డ్యాన్సులు రావా? ఫైట్లు రావా? సినిమాలు తీయడం,నటించడం రాదా? చిరంజీవి పకోడి ఎందుకు అవుతారు? ప్రత్యేక హోదా, పోలవరంపై స్పందించాలని ఆయన సలహా ఇచ్చారు. ఆయన సలహాలు మేము వింటాం. ఇండస్ట్రీలో వెధవలకు సలహలు ఇవ్వాలని కోరితే.. వ్యాఖ్యలు వక్రీకరించారు.

Kodali Nani

చిరంజీవి గురించి నేను ఏమన్నానో ఆయనకు తెలుసు. ఆయన నా మాటల వీడియోను చూసి ఉండరా? చిరంజీవిని రాజకీయంగా తిడితే ఏం జరుగుతుందో మాకు తెలియదా? వైసీపీ నేతల్లో చిరంజీవి అభిమానులు ఉన్నారు. నేను చిరంజీవి గురించి అడ్డగోలుగా మాట్లాడితే అభిమానులు ఊరుకొంటారా? నేను శ్రీరామా అంటే జనసేన, టీడీపీ వాళ్లకు నీ యమ్మా అని వినపడుతాయి అని కొడాలి నాని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X