twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10 ఏళ్ళు పీడించారు, వైఎస్ఆర్ మలుపు తిప్పారు.. 'యాత్ర'పై కొడాలినాని హాట్ కామెంట్స్!

    |

    దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2003లో చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రం రూపొందించబడింది. మహి వి రాఘవ్ వైఎస్ఆర్ జర్నీని యాత్ర చిత్రంలో ఎమోషనల్ గా చూపించారు. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రం ద్వారా వైఎస్ అభిమానులని కంట తడి పెట్టించేలా చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ దిగ్గజం మమ్ముట్టి నటించారు. యాత్ర చిత్రంపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

     అభిమానుల సంబరాల్లో

    అభిమానుల సంబరాల్లో

    యాత్ర చిత్రం నిన్ననే విడుదల కావడంతో గుడివాడ ఎమ్మెల్యే, వైసిపి లీడర్ కొడాలి నాని అభిమానుల సంబరాల్లో పాల్గొన్నారు. చిత్ర విడుదల సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా యాత్ర సినిమా గురించి, వైఎస్ఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి పాదయత్రని సినిమా రూపొందించడం సంతోషకరమైనవిషయం అని అన్నారు.

    10 ఏళ్ళు పట్టి పీడించారు

    10 ఏళ్ళు పట్టి పీడించారు

    రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 2003లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో అందరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల పాటు ప్రజల్ని పట్టి పీడించింది. అలాంటి సందర్భంలో రాజశేఖర్ రెడ్డి 1600 కిమీ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు తొలగించే అద్భుతమైన పథకాలు చేపట్టారని కొడాలి నాని ప్రశంసించారు.

    <strong>ఎన్టీఆర్ X వైఎస్ఆర్.. రికార్డ్ బీట్ చేయడంలో ఫెయిల్</strong>ఎన్టీఆర్ X వైఎస్ఆర్.. రికార్డ్ బీట్ చేయడంలో ఫెయిల్

    మహానుభావుడు

    మహానుభావుడు

    యాత్ర చిత్రంలో ఆయన ప్రవేశ పెట్టిన పథకాల వెనుకదాగున్న ఆలోచనని చూపించారని కొడాలి నాని తెలిపారు. పేదవాడు సరైన వైద్యం అందక, లక్షల్లో డబ్బు ఖర్చు చేయలేక ప్రాణాలు కోల్పోతుంటే రాజశేఖర్ రెడ్డి మహానుభావుడిలా ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే పిల్లలకు చదవాలనే కోరిక ఉన్నా, తల్లి దండ్రుల వద్ద అంత స్థోమత లేకపోవడంతో వారి చదువులు మధ్యలోనే ఆగిపోయేవి. అలాంటి వారికీ తండ్రిలా మరి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని నాని ప్రశంసించారు.

    వాళ్లంతా ఇప్పటికీ

    వాళ్లంతా ఇప్పటికీ

    వైఎస్ఆర్ పథకాల వలన లబ్ది పొందిన ప్రజలంతా ఇప్పటికి ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తున్నారని తెలిపారు. పేద వారికీ గూడు కల్పించి ఉచితవిద్యుత్ అందించారు. రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పి 5 సంవత్సరాల 3 నెలలపాటు దిగ్విజయంగా పాలన చేశారు. యాత్ర చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేయాలని నాని ఈ సందర్భంగా కోరారు. మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించగా ఆయన ఆత్మలా భావించే కెవిపి రామచంద్ర రావు పాత్రలో రావు రమేష్ నటించారు.

    English summary
    YSRCP MLA Kodali Nani comments on YSR Yatra movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X