బాహుబలి పాటపై నేతల రికార్డింగ్ డ్యాన్సులు.. ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో శృంగార స్టెప్పులు.. వీడియో వైరల్
అభిమానులు, కార్యకర్తల ఉత్సాహం కోసం వినోద కార్యక్రమాలు చేపట్టి ప్రజా ప్రతినిధులు వివాదాల్లో కూరుకుపోతారు. కార్యకర్తలు, దిగువస్థాయి నేతలు తమ నాయకుడిని సంతోష పరచాలని చేసిన వేడుకలతో ఎమ్మెల్యేలు జనాల మధ్య అభాసుపాలైన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఏపీలోని అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టిన రోజున రికార్డింగ్ డ్యాన్సర్లతో శృంగార నృత్యాలు చేయించిన సంఘటన వివాదంగా మారడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల వివరాల్లోకి వెళితే..
తాజాగా దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన వేడుకలను కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అందమైన అమ్మాయిలు, కలర్ ఫుల్ లైటింగ్‌తో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. ఓ దశలో రికార్డింగ్ డ్యాన్సర్లు రెచ్చి పోయి స్టెప్పులు వేశారు.

దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఇద్దరు నేతలు స్టేజీపై కూర్చొని ఉన్నారు. వారి మెడలో అధికార పార్టీ కండువాలను దర్జాగా కప్పుకొన్నారు. తమ చుట్టు శృంగార భంగిమలతో స్టెప్పులేస్తున్న డ్యాన్సర్లను చూస్తూ తన్మయత్వంతో ఆ వేడుకలో మునిగిపోయారు.
ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోగా భావిస్తున్న ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఆ వీడియోలో నేతల తొడలపై కూర్చొని డ్యాన్సర్లు శృంగార భంగిమలను ప్రదర్శించారు. ఈ వేడుకలు అభిమానులు, కార్యకర్తల కోలాహాలం మధ్య రసవత్తరంగా సాగినట్టు కనిపిస్తున్నది.
దర్శి ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో భాగంగా తెలుగు, హిందీ సినిమాల పాటలకు డ్యాన్సర్లు జోరుగా స్టెప్పులేసినట్టు సమాచారం. ఈ వేడుకలో బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలిలోని మనోహర పాటపై అమ్మాయిలు నృత్యాలు చేస్తూ శృంగార భంగిమలు ప్రదర్శించడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











