twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లో హీరో తరుణ్ 'యుద్ధం'

    By Bojja Kumar
    |

    యుద్ధం అంటే కొంపతీసి ఇంకేదో అనుకునేరు. సినిమా పేరే 'యుద్దం". శ్రీహరి, తరుణ్, యామి కాంబినేషన్‌లో రూపొందుతోంది ఈ చిత్రం. భారతీ గణేశ్ దర్శకత్వం వహిస్తుండగా, విశాఖ టాకీస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నట్టి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుంది. మొత్తం 13 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో సికిందరాబాద్ లీ ప్యాలెస్, ఫిల్మ్‌సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. కీలక సన్నివేశాలతో పాటు ఫైట్స్, ఓ పాటను షూట్ చే్స్తారు. దీంతో రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది.

    మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోందని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు. ఈ సినిమాలో ఇంకా బ్రహ్మానందం, ప్రగతి, గౌతంరాజులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: జస్వంత్, కూర్పు: గౌతంరాజు, సహ నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

    English summary
    Yuddam movie next schedule from 29 oct. Srihari, Tarun, Yami lead of the movie. Directed by Bharathi Ganesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X