Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
హైదరాబాద్‌లో హీరో తరుణ్ 'యుద్ధం'
యుద్ధం అంటే కొంపతీసి ఇంకేదో అనుకునేరు. సినిమా పేరే 'యుద్దం". శ్రీహరి, తరుణ్, యామి కాంబినేషన్లో రూపొందుతోంది ఈ చిత్రం. భారతీ గణేశ్ దర్శకత్వం వహిస్తుండగా, విశాఖ టాకీస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నట్టి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుంది. మొత్తం 13 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో సికిందరాబాద్ లీ ప్యాలెస్, ఫిల్మ్‌సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. కీలక సన్నివేశాలతో పాటు ఫైట్స్, ఓ పాటను షూట్ చే్స్తారు. దీంతో రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోందని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు. ఈ సినిమాలో ఇంకా బ్రహ్మానందం, ప్రగతి, గౌతంరాజులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: జస్వంత్, కూర్పు: గౌతంరాజు, సహ నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ.