చెప్పేసాడు: యుద్దం శరణం టీజర్ కోసమే అంతా వెయిటింగ్
యుద్ధం శరణం టీజర్‌ను జూలై 31న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లో సినిమాలోని నటీనటులను పరిచయం చేసిన చిత్రయూనిట్, ఈ నెల 31న టీజర్ ను రిలీజ్ చేస్తోంది. చైతూ మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండటం విశేషం.

కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిల్మ్
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘యుద్ధం శరణం' టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్ర సమర్పకుడు సాయి కొర్రపాటి చెప్పారు. ‘‘నాగచైతన్య రూపం, ఆయన పాత్ర చిత్రణ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
Recommended Video


15కే వస్తుందని చెప్పారు
శ్రీకాంత్, రావు రమేశ్‌వి చాలా కీలక పాత్రలు. మురళీశర్మ, రేవతి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజానికి ఈ టీజర్ ఈ జూలై 15కే వస్తుందని చెప్పారు గానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమయ్యింది.

జూలై 31న
ఇప్పుడు `యుద్ధం శరణం` టీజర్‌ను జూలై 31న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ఈ సినిమా టీజర్ రెగ్యులర్ టీజర్లలా కాకుండా కాస్త కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 31న టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన చైతన్య, మీ అందరికీ టీజర్ చూపించటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంటూ ట్వీట్ చేశాడు.

రేవతి, రావు రమేశ్
ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చైతు ట్వీట్ చేశాడు. ఇందులో శ్రీకాంత్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రేవతి, రావు రమేశ్‌లు కీలకపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











