twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ చైతన్య తెగింపు, అదరగొట్టేశాడంతే! (టీజర్)

    నాగ చైతన్య యుద్ధం శరణం టీజర్ రిలీజైంది. టీజర్ ఒక్కరాత్రిలోనే 1 మిలియన్ మార్క్ అందుకుంది.

    By Bojja Kumar
    |

    నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం యుద్ధం శ‌ర‌ణం. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌.

    ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోమవారం సాయంత్రం 5.45 గంటలకు విడుదలైంది. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలో నాగ చైతన్య తెగింపుగా ముందుకు సాగే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

    టీజర్ అదుర్స్

    టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోమవారం సాయంత్రం టీజర్ రిలీజవ్వగా.... మంగళవారం ఉదయం 9 గంటల్లోపే 1 మిలియన్ మార్క్ రీచ్ అయింది. ఫ్యామిలీ సెంటిమెంటుతో పాటు యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెనర్ గా సినిమా ఉంటుందని తెలుస్తోంది.

    సాయి కొర్రపాటి

    సాయి కొర్రపాటి

    వారాహి చ‌ల‌న చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ``విల‌క్ష‌ణ‌మైన హీరోయిజంతో ఉన్న సినిమాల‌ను చేయ‌డంలో ఆస‌క్తి చూపే అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన పుల్‌ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "యుద్ధం శరణం`. ఈ సినిమా అందరినీ నచ్చుతుందన్నారు.

    కీలక పాత్రల్లో

    కీలక పాత్రల్లో

    క‌థ‌కు త‌గ్గ టైటిల్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రావు రమేష్‌లు కీలకపాత్రల్లోఒ న‌టిస్తున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

    English summary
    Yuddham Sharanam Teaser released. Starring: Chay Akkineni, Srikanth, Lavanya Tripathi, Rao Ramesh, Revathi, Priyadarshi, Murli SharmaCinematographer : Niketh Bommi, Music: Vivek Sagar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X