Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
నాగ చైతన్య తెగింపు, అదరగొట్టేశాడంతే! (టీజర్)
నాగ చైతన్య యుద్ధం శరణం టీజర్ రిలీజైంది. టీజర్ ఒక్కరాత్రిలోనే 1 మిలియన్ మార్క్ అందుకుంది.
నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం యుద్ధం శరణం. సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోమవారం సాయంత్రం 5.45 గంటలకు విడుదలైంది. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలో నాగ చైతన్య తెగింపుగా ముందుకు సాగే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
టీజర్ అదుర్స్
టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోమవారం సాయంత్రం టీజర్ రిలీజవ్వగా.... మంగళవారం ఉదయం 9 గంటల్లోపే 1 మిలియన్ మార్క్ రీచ్ అయింది. ఫ్యామిలీ సెంటిమెంటుతో పాటు యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెనర్ గా సినిమా ఉంటుందని తెలుస్తోంది.
సాయి కొర్రపాటి
వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ``విలక్షణమైన హీరోయిజంతో ఉన్న సినిమాలను చేయడంలో ఆసక్తి చూపే అక్కినేని నాగచైతన్య నటించిన పుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "యుద్ధం శరణం`. ఈ సినిమా అందరినీ నచ్చుతుందన్నారు.
కీలక పాత్రల్లో
కథకు తగ్గ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రావు రమేష్‌లు కీలకపాత్రల్లోఒ నటిస్తున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
తెర వెనక
ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.