యుగళగీతాలు వచ్చాయ్
శ్రీకర్, చరిష్టా ప్రధాన జంటగా జిఎఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కవిత ఇంజేటి నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'యుగళగీతం'. కళాశాల నేపధ్యంగా సాగే చిత్రమిది. మూడు జంటల మద్య చోటు చేసుకొనే సంఘటనల సమాహారమిది. వినోదంతో పాటు సందేశాన్ని మేళవించాం. రాజ్ కిరణ్ అందించిన ఐదు పాటలు శ్రోతలకు నచ్చుతాయన్నారు. శివాజీ దర్శకుడు. రాజ్ కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆడియో సీడీని సి.కల్యాణ్ ఆవిష్కరించి ఎన్.శంకర్ కు అందజేశారు. కాశీ విశ్వనాథ్, మరుధూరి రాజా, సాయిశ్రీహర్ష, కవిత ఇంజేటి, జ్యోతి, రాజ్ కిరణ్, అభిషేక్, శ్రీకర్, చందు, గుండు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు శివాజీ, తానూ గతంలో దర్శకత్వ శాఖలో కలిసి పనిచేశామనీ, ఈ చిత్రంతో శివాజీకి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ, దర్శకుడు శివాజీకి రావలసినంత పేరు రాలేదనీ, ఈ చిత్రంతో మంచి సక్సెస్ సాధిస్తారని అనుకుంటున్నానని అన్నారు. అలాగే ఈ చిత్ర నిర్మాత కూడా సక్సెస్ ఫుల్ మహిళా నిర్మాతల సరసన చేరుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. చిత్ర మాటల రచయిత మరుధూరి రాజా మాట్లాడుతూ, చిన్న సినిమా అయినా ఎంతో ప్రేమగా ఈ చిత్రానికి మాటల రాశాననీ, నిర్మాత కవితకు చక్కటి అడ్మినిస్ట్రేషన్ తెలుసుననీ అన్నారు. ఆడియోతో పాటు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందనీ, సినిమా విజయం కాంక్షించిన అందరికీ తన కృతజ్ఞతలనీ శివాజీ అన్నారు.


Click it and Unblock the Notifications











