'యుగానికి ఒక్కడు' మారిన రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
వెంకటేష్ తో ఆడువారి మాటలకు అర్దాలే వేరులే చిత్రాన్ని రూపొందించిన శ్రీ రాఘవ దర్శకత్వం వహించిన చిత్రం 'యుగానికి ఒక్కడు'. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసారు కానీ కాలేదు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామంటూ నిర్మాతలు మీడియాకు తెలియచేసారు. ఈ సందర్బంగా ఈ సినిమా గురించి చిత్ర సమర్పకుడు ఆర్.రవీంద్రన్ మాట్లాడుతూ ''తెలుగు అనువాద కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ఇటీవలే విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. సాహసోపేతమైన యాక్షన్ తరహా కథనమిది. రూ. 40 కోట్ల వ్యయంతో రెండున్నరేళ్ళు కష్టించి తెరకెక్కించాం. ఈ నెల 29న తెలుగులో విడుదల చేస్తున్నామ''ని అన్నారు. పార్తీబన్, ప్రతాప్ పోతన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీరామకృష్ణ, పాటలు: భువనచంద్ర, అనంతశ్రీరామ్, కెమెరా: రామ్‌జీ, కూర్పు: కోలాభాస్కర్, ఫైట్స్: రాంబో రాజ్‌కుమార్, కళ: సంతోషం. సూర్య సోదరుడు కార్తి హీరోగా నటించిన చిత్రం ఈ 'యుగానికి ఒక్కడు' చిత్రాన్ని డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తోంది. రీమాసేన్, ఆండ్రియా జెరోమియా కథానాయికలు. శ్రీరాఘవ దర్శకత్వం వహించారు. జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక హీరో కార్తీ నటించిన పరుత్తి వీరన్ తమిళనాట సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం అనంతరం రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ఈ చిత్రంలో చేసారు కార్తీ. అలాగే ఈ చిత్రం ప్రోమోలు ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఆంద్రాలోనూ ఈ చిత్రం విడుదలపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











