twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "మీలో ఉందా సత్తా?" రవీంద్ర భారతిలో షార్ట్ ఫిలిం కాంటెస్ట్

    |

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో భాషా, సాంస్కృతిక శాఖ, సినివారం ఆద్వర్యంలో లఘుచిత్రాల (షార్ట్ ఫిల్మ్స్) పోటీకి మీ నుంచి దరఖాస్తులని ఆహ్వానిస్తుంది. ఈ మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రకటన విడుదల చేసారు...

    లఘుచిత్రాలు

    లఘుచిత్రాలు

    ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూ కొత్తకథలతో, కథనాలతో,టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లు కానీ, డాక్యుమెంటరీలు కానీ అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి. అయితే... ఇంతటి నవ్య ఆలోచనలతో దూసుకువస్తున్న నవతరం ఫిల్మ్ మేకర్స్ కి తమ ఫిల్మ్ ని ప్రదర్శించుకునే ప్రివ్యూ థియేటర్స్ కానీ, వేదికలు కానీ కొరతగా ఉన్నాయి.

    భాషా సాంస్కృతిక శాఖ

    భాషా సాంస్కృతిక శాఖ

    ఉన్నప్పటికి అవన్నీ వ్యయభరితంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ రవీంద్రభారతి రెండవ అంతస్తులోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ప్రతీ శనివారం "సినివారం" పేరిట ఈ నవతరం దర్శకులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్/డాక్యుమెంటరీలను/ఫీచర్ ఫిల్మ్ లను ప్రదర్శిస్తున్నది.

     లఘుచిత్రాలు/డాక్యుమెంటరీలు

    లఘుచిత్రాలు/డాక్యుమెంటరీలు

    ఈ స్క్రీనింగ్ సౌకర్యాన్ని ఉచితంగా అందించి వారిని ప్రోత్సహిస్తున్నది. ఔత్సాహిక యువ దర్శక-రచయిత-నటులు తాము తీసిన లఘుచిత్రాలు/డాక్యుమెంటరీలను ప్రదర్శించాలనుకునే యువ సినీ దర్శకులు ఈ "సినివారం" అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

    యువ చిత్రోత్సవం

    యువ చిత్రోత్సవం

    కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా "సినివారం" ఇచ్చిన విజయాన్ని నవతరం సినిమా దర్శకులకు మరింత చేరువ చేయాలనే లక్స్యంతో తెలంగాణ యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో భాషా సాంస్కృతిక శాఖ, సినివారం ఆద్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా "యువ చిత్రోత్సవం" - లఘుచిత్రాల పోటీకి మీ నుంచి దరఖాస్తులని ఆహ్వానిస్తుంది.

     నియమాలు

    నియమాలు

    నియమాలు:

    చిత్రాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు భాషని ప్రతిబింభిస్తూ తెలంగాణ జీవనానికి అద్దం పట్టేలా ఉండాలి.
    హింస, అశ్లీలతకి తావు లేకుండా ఇతరుల మనోభావాలను నొప్పించకుండా ఉండే కథాంశాలు ఉండాలి.
    నిడివి 05 నుంచి 20 నిమిషాలు

     ఎంట్రీ ఉచితం

    ఎంట్రీ ఉచితం

    ఎంట్రీ ఉచితం

    ఎంట్రీ చివరి తేదీ 8 డిసెంబర్ 2017
    అవార్డ్ ఫంక్షన్ 18 డిసెంబర్ 2017
    మీరు మీ చిత్రాలను పెన్ డ్రైవ్ లో కానీ, డి.వి.డి. లో కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, యూట్యూబ్ ప్రైవేట్ లింక్ లేదా నేరుగా మా చిరునామాకు వచ్చి అందివ్వవచ్చు.
    లఘు చిత్రం తో పాటు మీ వివరాలు తో కూడిన అప్లికేషన్ అందివ్వాలి.

     తుది నిర్ణయం నిర్వాహకులదే

    తుది నిర్ణయం నిర్వాహకులదే

    ఈమెయిల్: [email protected], Website: www.tsdolc.com. & http://www.ravindrabharathi.org/

    ఫోన్ నంబర్: 9676726726/9849391432/040-23212832.
    * తుది నిర్ణయం నిర్వాహకులదే
    పైన తెలిపిన అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన న్యాయ నిర్ణేతల కమిటీ ద్వారా ఉత్తమ చిత్రాలని ఎంపిక చేయటం జరుగుతుంది.

     నగదు పురస్కారంతో పాటు అవార్డ్, ప్రశంసా పత్రం

    నగదు పురస్కారంతో పాటు అవార్డ్, ప్రశంసా పత్రం

    మొదటి బహుమతి : 50,000/-

    రెండవ బహుమతి : 40,000/-
    మూడవ బహుమతి : 30,000/-
    కన్సోలేషన్ బహుమతులు - 3 : ఒక్కోటి 25,000/-
    అవార్డ్ పొందిన చిత్రాల దర్శక నిర్మాతలకి నగదు పురస్కారంతో పాటు అవార్డ్, ప్రశంసా పత్రం లభిస్తాయి. పోటీకి వచ్చిన చిత్రాల్లో అర్హమైన వాటిని ప్రతి శనివారం నిర్వహించే "సినివారం"లో ప్రదర్శిస్తారు.

    English summary
    "Yuva Chitrotsavam" Short film Contest in Ravindra Bharathi, during the Telangana world festivel at Hydearabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X