twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలి రంజాన్ వేడుకలో యువన్ శంకర్ రాజా (ఫొటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ దక్షిణాది సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు ఈ రంజాన్ పండగ జీవితంలో మరువ లేనిది. ఇటీవలే ఇస్లాం మతం స్వీకరించిన యువన్ శంకర్ రాజా తొలి రంజాన్ పండగను ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నాడు. బంధువులు, స్నేహితులను ఆహ్వానించి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు.

    రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని యువన్ శంకర్ రాజా ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అనంతరం తన స్నేహితులు, సన్నిహితులకు బిర్యానీ పార్టీ ఇచ్చారు. దీంతో పాటు ప్రత్యేకమైన రంజాన్ వంటకాలను తయారు చేయించినట్లు సమాచారం. యువన్ బిర్యానీ పార్టీకి తమిళ సినీ సెలబ్రిటీలు ప్రేమ్ జీ, వెంకట్ ప్రభు, కార్తీక్ రాజా, వాసుకి తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

    ఇస్లాంలోకి...

    ఇస్లాంలోకి...

    ఈ సంవత్సరం ఫిబ్రవరిలో యువన్ శంకర్ రాజా ఇస్లాం స్వీకరిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నేను ఇస్లాంను ఫాలో కావాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు గర్వంగా ఉంది. మా ఫ్యామిలీ సపోర్టు కూడా ఉంది. నా తండ్రికి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు' అంటూ యువన్ శంకర్ రాజా తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు.

    అనేక కారణాలు...

    అనేక కారణాలు...

    యువన్ శంకర్ రాజా తన తల్లితో చాలా క్లోజ్‌గా ఉండే వారు. అక్టోబర్ 31, 2011న ఆమె మరణించడంతో యువన్ చాలా డిస్ట్రబ్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ ఆధ్యాత్మిక గురువును కలిసిన యువన్ శంకర్ రాజా...ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

    శ్రద్దగా ఇస్లాం ఆచరిస్తున్నారు

    శ్రద్దగా ఇస్లాం ఆచరిస్తున్నారు

    గత సంవత్సర కాలం నుండి ఇస్లాంలోకి మారే ఆలోచనలో యువన్ శంకర్ రాజా ఉన్నారని, ఇందుకోసం ఆయన రోజూ 5 సార్లు నమాజ్ చేస్తున్నారని, ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తప్పకుండా నమాజ్‌కు సమయం కేటాయిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

    యువన్ శంకర్ రాజా

    యువన్ శంకర్ రాజా

    తండ్రి ఇళయరాజా సంగీత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువన్ శంకర్ రాజా దక్షిణాదిన సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా ఎదిగారు. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు.

    English summary
    Yuvan Shankar Raja had a memorable Eid this time. This is his first Muslim festival after converting to Islam earlier this year. The music director had a fantastic day with his relatives and friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X