పవన్ కళ్యాణ్ ‘షాడో’ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్...
ప్రస్తుతం తను చేస్తున్న 'తీన్ మార్' సినిమా తర్వాత పవన్ కల్యాణ్, తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. 'ది షాడో' పేరుతో రూపొందే ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగు జరుగుతోంది.
గతంలో విష్ణువర్ధన్, యువన్ ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మంచి మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. ఆ సెంటిమెంటు ఈ సినిమాకి కూడా వర్కౌట్ అవుతుందని నిర్మాతలు హ్యాపీగా వున్నారు. పవన్ కల్యాణ్ సినిమా కావడంతో యువన్ కూడా తన దృష్టంతా ఈ సినిమాపైనే పెడుతున్నాడట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమా 'గబ్బర్ సింగ్' దీని తర్వాత ప్రారంభమవుతుంది.
పవన్ కళ్యాణ్ యువన్ శంకర్ రాజా ఇళయరాజా ది షాడో గబ్బర్ సింగ్ pawan kalyan yuvan shankar raja ilayaraja the shadow gabbar singh


Click it and Unblock the Notifications