అది చెప్పటానికే రామ్ చరణ్ చిత్రం ప్రెస్ నోట్

By Srikanya

హైదరాబాద్ : పెద్ద హీరోల చిత్రాలకు చెందిన మార్పు ప్రతీదీ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు తెలియచేస్తూ, ఆ విధంగా పబ్లిసిటీ సంపాదిస్తూంటారు దర్శక,నిర్మాతలు. ఇప్పుడు రామ్ చరణ్ చిత్రంలో యవన్ శంకర్ రాజాని సంగీత దర్శకుడుగా ఎంచుకున్నారు. తమన్ ని తొలిగించారు. ఆ విషయం అఫీషియల్ గా మీడియాకు తెలియబరిచారు నిర్మాత బండ్ల గణేష్.

నిర్మాత మాట్లాడుతూ ''ఫిబ్రవరి 6న చిత్రీకరణ మొదలుపెట్టాం. టైటిల్‌ ప్రకటించగానే అందరి నుంచీ మంచి స్పందన వచ్చింది. దానికి తగ్గట్టే చిత్రాన్ని కృష్ణవంశీ రూపొందిస్తున్నారు. రామ్‌చరణ్‌ - కాజల్‌ జంట మరోసారి ఆకట్టుకోబోతోంది. 40 రోజుల షెడ్యూల్‌ పూర్తవ్వగానే విదేశాల్లో పాటల్ని తెరకెక్కిస్తాం. మా చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా స్వరాలు అందిస్తున్నార''న్నారు.

yuvan Shankar Raja Confirm for Ram Charan

ఇక కృష్ణవంశీ సినిమా అంటే... కుటుంబ బంధాల సమాహారమే. మరోసారి ఆయన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో ఉమ్మడి కుటుంబంలోని అనురాగాల్ని చూపించబోతున్నారు . రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, రాజ్‌కిరణ్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఇటీవల కన్యాకుమారి, పొలాచ్చిలలో చిత్రీకరణ జరిపారు. ఈనెల 21 నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 40 రోజుల పాటు సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. తాత, మనవడుగా రాజ్‌కిరణ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X