For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పంజా’ మ్యూజిక్ డైరెక్టర్ మూడో పెళ్లి చేసుకున్నాడు!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడు, ప్రముఖ యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మూడో వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కిజకరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి జఫరున్నీసాను ఆయన గురువారం పెళ్లాడారు. అక్టోబర్ 28 , 2014న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా వివాహంతో ఏకమయ్యారు.

  35 సంవత్సరాల యువన్ 2005లో మార్చి 21న తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ సుజయ చంద్రన్‌ను పెళ్లాడారు. ఆమె లండన్‌లో సెటిలైన సింగర్. తర్వాత ఇద్దరూ పరస్సర అంగీకారంతో విడిపోయారు. 2008లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. తర్వాత 2011లో సెప్టెంబర్ 1న శిల్పా అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి వీరి దాంపత్య జీవితం బీటలు వారింది. చాలా రోజుల నుండి యువన్ ఒంటరిగానే ఉంటున్నారు. త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించిన ఆయన అక్టోబర్ 28 జప్ఫ్రున్నిసా అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు.

  Yuvan Shankar Raja gets married a third time

  తెలుగులో పంజా, గోవిందుడు అందరి వాడేలే, దేనికైనా రెడీ, మిస్టర్ నూకయ్యా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, హ్యాపీతో పాటు అనేక చిత్రాలకు సంగీతం అందించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన మతం కూడా మార్చుకున్నారు. ఇస్లాం స్వీకరిచారు.

  రంజాన్‌ సందర్భంగా మసీదుకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేశాయి. దీనిపై యువన్‌ వివరణ ఇస్తూ.. ''మత మార్పునకు కారణం అమ్మే. ఆమె అనారోగ్యం పాలైనప్పుడు ముంబయిలో ఉన్నా. వెంటనే చెన్నైకి వచ్చా. సోదరితో కలిసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లా. ఆమె నా చెయ్యి పట్టుకుని ఆవేదన చెందారు. తరువాత దూరమయ్యారు. అమ్మ ఏమైపోయిందోనని ఆలోచించా. ఆమె ఆత్మ ఎలా రూపాంతరం చెందిందోనని వెతకడం ప్రారంభించా.

  Yuvan Shankar Raja gets married a third time

  నా ముస్లిం స్నేహితుడొకరు.. మక్కాలో తాను ప్రార్థన చేసిన చాపను నాకు ఇచ్చారు. గుండె భారంగా ఉన్నప్పుడు దీనిపై కూర్చోమని చెప్పారు. దాన్ని నా గదిలో పెట్టేశాను. ఓ సారి మరో మిత్రుడితో అమ్మ గురించి మాట్లాడుతుండగా ఆ చాపపై కూర్చున్నా. ఖురాన్‌ పఠించడం ప్రారంభించా. జనవరిలో మతం మారాలని నాన్నతో చెప్పా. అడ్డుకోలేదు. ఆ తరుణంలోనే అమ్మ నా చేయి పట్టుకుని 'నువ్వు ఒంటరిగా ఉన్నావు. ముస్లిం అనే మహావృక్షం కింద కూర్చోమ'ని సలహా ఇచ్చినట్లు అనిపించింది. అలా మతం మారాను'' అని పేర్కొన్నారు.

  English summary
  Ramanathapuram : Music composer Yuvan Shankar Raja, son of popular music director Ilayaraja, today got married for the third time to Jaffrunnisha, a native of Keezhakarai in the district.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X