నో ఇళయరాజా: యువన్ శంకర్ రాజా పెళ్లి (ఫోటోస్)
హైదరాబాద్: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడు, ప్రముఖ యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇటీవల మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కిజకరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి జఫరున్నీసాను ఆయన పెళ్లాడారు. జనవరి 1 రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్య వివాహ వేడుక జరిగింది.
అయితే ఈ వివాహ వేడుకకు యువన్ శంకర్ రాజా తండ్రి ఇళయరాజా గైర్హాజరు కావడం గమనార్హం. ఆయనకు రావడం ఇష్టం లేకనే గైర్హాజరైనట్లు సమాచారం. అయితే యువన్ శంకర్ రాజా సోదరి భవతరిణి మాత్రం యువన్ మూడో పెళ్లిని మొదటి నుండీ సపోర్టు చేస్తూ వస్తోంది. వివాహ వేడుక సమయంలో కూడా ఆమె ఆయన వెంటే ఉన్నారు.
యువన్ శంకర్ రాజా వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. స్లైడ్ షోలో ఓ లుక్కేయండి.

నూతన వధూవరులు, భవతరిణి
నూతన వధూవరులు యువన్ శంకర్ రాజా, జఫరున్నీసాలతో కలిసి భవతరిణి.

ఇస్లాం ప్రకారం
ఇస్లాం సాంప్రదాయం ప్రకారం యువన్ శంకర్ రాజా వివాహ వేడుక జరిగింది.

ప్రేమ వివాహమా?
యువన్ శంకర్ రాజా జఫరున్నీసాను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పేరు కూడా మార్చుకున్నాడా?
గతేడాది యువన్ శంకర్ రాజా ఇస్లాం మతం స్వీకరించారు. పేరు కూడా మార్చుకున్నట్లు సమాచారం. అయితే పరిశ్రమలో మాత్రం ఆయన పేరు అలానే కొనసాగుతోంది.

కొత్త జీవితం
జఫరున్నీసాతో వివాహం తర్వాత యువన్ శంకర్ రాజా కొత్త జీవితం ప్రారంభించారు.

కలిసొస్తుందా?
కెరీర్ పరంగా ఈ ఏడాది తనకు మరింత కలిసొస్తుందని యువన్ శంకర్ రాజా భావిస్తున్నారట.

బంధువులు, స్నేహితులు
వివాహ వేడుక సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి యువన్ శంకర్ రాజా సంతోషంగా గడిపారు.

గత వివాహాలు
35 సంవత్సరాల యువన్ 2005లో మార్చి 21న తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ సుజయ చంద్రన్‌ను పెళ్లాడారు. ఆమె లండన్‌లో సెటిలైన సింగర్. తర్వాత ఇద్దరూ పరస్సర అంగీకారంతో విడిపోయారు. 2008లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. తర్వాత 2011లో సెప్టెంబర్ 1న శిల్పా అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి వీరి దాంపత్య జీవితం బీటలు వారింది. చాలా రోజుల నుండి యువన్ ఒంటరిగానే ఉంటున్నారు. ఇపుడు జఫరున్నీసాను మూడో వివాహం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











