'యువరాజ్యం'లో పవన్ లేడు
గుడుంబా శంకర్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన వీర్ శంకర్ ..యువరాజ్యం పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తమ ప్రజారాజ్యం పార్టీకి అనుబంధంగా యువరాజ్యం స్ధాపించటంతో ఈ చిత్రం ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ప్రారంభమయినట్లు వినిపించాయి. అయితే అటువంటిదేమీ లేదని ఎలక్షన్ టైమ్ లో రిలీజ్ కాకపోవటంతో అందరికీ అర్ధమైంది. అయితే ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేసి ఉంటే ఎంతోకొంత ఆ ఫీవర్ ని క్యాష్ చేసుకునే అవకాశం ఉందని నిజం. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ కి ఈ చిత్రం పూర్తి చేసి రిలీజ్ చేసే యోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. అందునిమిత్తం వచ్చే నెలలో ఈ చిత్రం క్లైమాక్స్ ని కాకినాడలో పదివేల మంది సమక్షంలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎనభై శాతం పూర్తి చేసుకున్న ఈచిత్రం క్లైమాక్స్ షూట్ తో పూర్తవుతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో అంతా కొత్త వారు నటిస్తున్నారు. అలాగే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో గెస్ట్ గా నటించనున్నాడనే వార్తలు సైతం వచ్చాయి. అయితే అటువంటిదేమీ జరగటం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











