యువరాజ్ సింగ్ తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన పవన్ హీరయిన్
ఒక గురువుకు ఒక శిష్యురాలుకి ఉన్న సంబంధం అది. అతన్ని నేను ఓ క్రికెట్ గురువుగా భావిస్తున్నాను. అతని ఆటను చూస్తూనేను కూడా అలా ప్రాక్టీసు చేస్తుంటాను. అందుకే ప్రతి చోటికీ వెళ్లి ఆయన ఆటను గమనిస్తూంటా. అంతేకానీ మీరేదేదో ఊహించుకుంటే దానికి బాధ్యత నాది కాదంటోంది అమీషా పటేల్. పవన్ తో బద్రి, మహేష్ తో నాని, బాలకృష్ణతో పరమవీర చక్ర చిత్రాలు చేసినఈ ముద్దుగుమ్మ తనకు క్రికెట్ అంటే ప్రాణమని, యువరాజ్ సింగ్ తో తనకు సంభంధం అంటగట్టవద్దని అంటోంది. ఇక రీసెంట్ గా వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో అమీషా పటేల్ ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడ విఐపీ పాస్ లతో ప్రత్యక్షమైంది. ఇన్ని పాస్‌లు అమీషాకు ఎక్కడివని ఆరా తీస్తే అవన్నీ యువరాజ్ సింగ్ నుంచి వచ్చినవి అని తేలింది. ప్రతి ఆటకూ యువరాజ్ సింగే ఆమెకు పాసులిచ్చి మరీ పిలిపించుకున్నాడని, అందుకు తగ్గట్టుగా ఆమె అతని షాట్లకు ఉత్సాహంతో రెచ్చిపోయి యవీని ప్రోత్సహించిందని తెలిసినవాళ్లు బాలీవుడ్ మీడియాలో చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











