చిరు హీరోయిన్ తో క్రికిటర్ లవ్వాట

అలాగే తనకు ముంబైలో సినీఫీల్డ్‌కు సంబంధించి కొందరు స్నేహితులున్నారని, అలాగే యువీ కూడా కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమేనని చెప్తూ వచ్చిన కరిష్మా కొటక్ తాజాగా ఈ విషయం బయటపెట్టింది. గత కొద్దినెలల క్రితమే ఓ స్నేహితునిద్వారా యువరాజ్ పరిచయమయ్యాడనీ అయితే తాము కేవలం ప్రెండ్స్ మాత్రమేనంటోంది. అలాగే ఇంతవరకూ తన భాయ్ ప్రెండ్ మ్యాచ్‌ల్ని ప్రత్యక్షంగా చూడలేదంటున్న ఈ అందం.. త్వరలోనే స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ల్ని తిలకిస్తానని చెబుతోంది. అంతేగాక హి ఈజ్ రియల్లీ స్వీట్ అండ్ నైస్ గై అంటూ యువరాజుని తెగపొగిడేస్తోంది. ఇదంతా చూస్తూంటే..కరిష్మా ప్రేమ పట్టాలెక్కినట్లేనంటున్నారు బాలీవుడ్ వాసులు.


Click it and Unblock the Notifications











