For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సమంత 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' రిలీజ్ డేట్ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్: 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని, సమంత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. తొలుత దీపావళి కానుకగా జనం చెంతకు తెస్తారని భావించారు. అయితే సమయం తక్కువగా ఉండటం, విడుదలపై ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రేమికుల రోజు కానుకగా రానున్న ఫిబ్రవరి 14న థియేటర్లలోకి తెస్తారనే వార్తలు షికార్లు చేశాయి. అయితే దీనిని డిసెంబర్‌ 14న విడుదల చేస్తున్నట్లు వినికిడి. అధికారక ప్రకటన లేకున్నా.. విశ్వసనీయ వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

  ప్రేమ, ఎన్‌కౌంటర్‌ కథలను అత్యంత స్త్టెలిష్‌గా చిత్రీకరించటంలో దిట్టగా పేరొందిన గౌతమ మీనన్‌ దర్శకుడు. ఆయన చిత్రంలో నాని తొలిసారిగా నటిస్తున్నాడు. సమంత మరోసారి నాని తో జట్టు కట్టటంతో అంచనాలు పెరిగాయి. మూడు దశాబ్దాలుగా శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న మేస్ట్రో ఇళయరాజా అందించిన బాణీలు ఇప్పటికే మార్మోగుతున్నాయి. గౌతంమీనన్‌ చిత్రాలంటే ప్రేమకు ఏమాత్రం కొదవుండదు. అందుకు కాస్త స్త్టెల్‌ జోడించి తనదైన శైలిలో చిత్రాన్ని మలుస్తారాయన.

  'ఏమి మాయ చేసావే' అంటూ సినీ ప్రేక్షకులను ఆహ్వానించిన గౌతంమీనన్‌.. ప్రస్తుతం 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' అంటున్నారు. ప్రేమలోని లోతులతో తెరకెక్కించారని చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. వాస్తవానికి దీపావళి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. పెద్ద చిత్రాలు ఆ సమయంలో క్యూ కడుతున్నందున డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. తమిళంలోనూ అదేరోజున విడుదల అవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

  ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ.... ''నా అభిమాన దర్శకుడు రూపొందిస్తున్న 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' చిత్రంలో హీరోయిన్‌గా నటించటమనేది ఈ సంవత్సరంలో నాకు వచ్చిన అపురూపమైన అవకాశంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో కాలేజీ అమ్మాయిగా నటిస్తున్నా. ఒక అబ్బాయి, అమ్మాయిల నడుమ చోటు చేసుకున్న సంఘటన సమాహారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాక మూడు భాషల్లో హీరోయిన్‌గా నేనే నటిస్తున్నా. తమిళంలో జీవా, తెలుగులో నాని అలాగే హిందీలో రాయ్‌ కపూర్‌కు జంటగా తెరపై కనిపిస్తాను'' అని వివరించింది.

  English summary
  While the grapevine recently had it that Yeto Vellipoyindi Manasu will hit the screens in mid-November, the latest feelers from the makers' sources have it that the film will release only in mid-December. YVM is produced by C Kalyan, whose recently-released Shiva Thandavam has not done well.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more