చిరంజీవి హీరో... ఉపేంద్ర దర్వకత్వం.. విచిత్రమైన కథతో షాక్.. అసలేం జరిగిందంటే!

Recommended Video

Upendra's New Movie I Love You Trailer Launch Event | Filmibeat Telugu

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన తాజా చిత్రం ఐ లవ్ యూ. ఈ చిత్రానికి నన్నే ప్రేమించు ఉప శీర్షిక. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వైవీఎస్ చౌదరీ, నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరీ మాట్లాడుతూ చిరంజీవిని ఉపేంద్ర డైరెక్ట్ చేసే అవకాశం గురించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు..

కుండ బద్దలు కొట్టే విధంగా ఉపేంద్ర

కుండ బద్దలు కొట్టే విధంగా ఉపేంద్ర

ప్రతీ మనిషిలో రెండు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. బహిర్గతంగా ఒకటి.. అంతర్గతంగా వ్యక్తిత్వాలు ఉంటాయి. ఉపేంద్ర మాదిరిగానే ఆయన సినిమాలోని పాత్రలు బహిర్గతంగానే మాట్లాడుతుంటాయి. మనసులోని భావాలను కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతాయి. అలాంటి కోవలోని చిత్రమే ఐ లవ్ యూ.. నన్నే ప్రేమించు అని వైవీఎస్ చౌదరీ అన్నారు.

అర్జున్ రెడ్డి, RX 100కి ముత్తాతగా A, ఓం చిత్రాలు

అర్జున్ రెడ్డి, RX 100కి ముత్తాతగా A, ఓం చిత్రాలు

అర్జున్ రెడ్డి, RX 100 లాంటి సినిమాలకు తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్ర ఎప్పుడో తీశారు. A, ఓం, ఉపేంద్ర సినిమాలు ఈ చిత్రాలకంటే ఎంతో ముందున్నాయి. ఆ సినిమాలోని పాత్రలు చూడటానికి అతిగా ఉన్నా.. ఉపేంద్ర కన్విన్స్ చేసే విధానం గొప్పగా ఉంటుంది.

ఉపేంద్రకు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం

ఉపేంద్రకు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం

ఉపేంద్రతో నాకు పనిచేసే అదృష్టం అనుభవం ఉంది. వైజయంతీ మూవీస్‌లో నేను కో-డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు చిరంజీవి సినిమాకు డైరెక్ట్ చేయమని మిమ్మల్ని అశ్వినీదత్‌ పిలిపించారు. అప్పటి వస్తున్న కథలకు భిన్నంగా, చిరంజీవి ఇమేజ్‌కు భిన్నంగా ఉండే కథ చెప్పడంతో అందరూ షాక్ గురయ్యారు అని వైవీఎస్ చౌదరీ పేర్కొన్నారు.

చిరంజీవికి ఉపేంద్ర చెప్పిన కథ

చిరంజీవికి ఉపేంద్ర చెప్పిన కథ

చిరంజీవి కోసం ఉపేంద్ర ఓ విచిత్రమైన కథను చెప్పారు. కమర్షియల్ వ్యాల్యూస్‌తో ఇలా కూడా ఓ సినిమా కూడా తీస్తారా అని ఆశ్చర్యం కలిగింది. చిరంజీవి ద్విపాత్రాభినయంతో ఉండే కథను చెప్పారు. ఆ కథను ఎవరూ కూడా ఊహించలేరు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో అనేక కథలు సినిమాలకు స్ఫూర్తిగా ఉంటాయి. కానీ అప్పుడు చెప్పిన కథ ఏ సినిమాలో కూడా కనిపించదు. అలాంటి విభిన్నమైన కథ అది వైవీఎస్ చెప్పారు.

మీరు నిజంగానే రియల్ స్టార్

మీరు నిజంగానే రియల్ స్టార్

ఉపేంద్ర తీసే సినిమాల్లో సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు కనిపిస్తాయి. కష్ట, నష్టాలను బ్లంట్‌గా చూపిస్తారు. అందుకే మిమ్మల్ని రియల్ స్టార్ అంటారు. సమాజంపై మీకు ఉన్న బాధ్యత వల్లే మీరు పార్టీ పెట్టగలిగారు. ఆ అర్హత మీకే ఉంది అని వైవీఎస్ చౌదరీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X