పవన్ కళ్యాణ్ కి హాట్సాఫ్ చెబుతున్నా: వైవియస్ చౌదరి
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తనకు స్పూర్తి ఇచ్చినవారిలో ముఖ్యులంటూ వైవియస్ చౌదరి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ...నా గత చిత్రం విడుదలకు ముందు 'రేయ్' సినిమా రూపొందించే బాధ్యత నాకు అప్పగించింది మెగా ఫ్యామిలీ. అది జరిగిన కొన్ని రోజులకు నా సినిమా విడుదలై అపజయం పొందింది. వెంటనే మెగా బ్రదర్స్‌లో ఒకరైన పవన్‌కళ్యాణ్‌గారికి నా బాధ్యతగా ఒక మెసేజ్ ఇచ్చాను.
అదేమిటంటే.. ఈ సినిమా రిజల్ట్ దృష్ట్యా మీ మేనల్లుడి సినిమా విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఇబ్బంది పడను.. అని. ఐదు నిముషాలు గడిచాయో లేదో పవన్‌కళ్యాణ్‌గారి నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ లో.... 'జయాపజయాలు నాకు ముఖ్యం కాదు.. వ్యక్తిత్వం, అంకితభావం నాకు ముఖ్యం. మీ కమిట్‌మెంట్, కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. అందుకే ఎటువంటి సంకోచం లేకుండా ముందుడుగు వెయ్యండి. మీకు అండగా నేనున్నాను...' అంటూ ఇచ్చారు.
ఆ రోజు పవన్‌కళ్యాణ్‌గారు ఇచ్చిన మెసేజ్ నాకు ప్రోత్సాహాన్నిచ్చి, ఎక్కడా రాజీపడకుండా 'రేయ్' సినిమాని తీసేలా చేసింది.
నా 28 ఏళ్ల సినీజీవితంలో దర్శకుడు అపజయాల్లో ఉన్పప్పుడు ఓ స్టార్ హీరో నుంచి ఇటువంటి మెసేజ్ అందుకోవడం ఇదే ప్రథమం. అందుకు ఈ సందర్భంగా వపన్‌కళ్యాణ్‌గారికి హాట్సాఫ్ చెబుతున్నా అన్నారు.


Click it and Unblock the Notifications












