twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ గారూ ఒక్క హగ్ ప్లీజ్...(పవన్ గురించి వైవిఎస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'రేయ్' మూవీ ఆడియో విడుదల శుక్రవారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మిమ్మల్ని ఒక్కసారి హగ్ చేసుకోవాలని ఉందంటూ.....పవన్ కళ్యాణ్‌ను హగ్ చేసుకున్నారు.

    సినిమాలపై పిచ్చితో దర్శకుడిగా మారాను. నేను సినిమాల్లోకి రావడానికి ఎన్టీఆర్ గారే స్ఫూర్తి. నేను కూడా మీలాగే పవన్ కళ్యాణ్ అభిమానిని. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే....నేను నా మొదటి సినిమా పవన్ కళ్యాణ్ గారితో తీయాలనుకున్నాను. అప్పట్లో బక్క పలుచగా ఉన్న వ్యక్తిని పోస్టర్‌పై చూసాను. రజనీకాంత్‌లో ఉండే ధృడత్వం అతనిలో కనిపించింది. నా మనసులో ఒక పవర్, ఎలక్ట్రిసిటీ పాసైంది. తర్వాత ఆరా తీస్తే అతను పవన్ కళ్యాన్ అని తెలిసింది.

    వైవిఎస్ చెప్పిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

    మొదటి సినిమా పవన్‌తో అనుకున్నా...

    మొదటి సినిమా పవన్‌తో అనుకున్నా...


    నా మొదటి సినిమా ఆయనతో చేయాలని కలిసాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేక పోయాం. నేను తీసుకునే కొత్త వాళ్లలో పవన్ కళ్యాణ్ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారినే నేను తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ హిస్టిరిక్స్ నాలో మిళితమైపోయి ఉన్నాయి. నా ప్రతి సినిమా ఆడియోను ఆయనకు ఇస్తుంటాను. ఆయన్ను కలవడానికి వీలుకాకుంటే వాళ్ల ఇంటి వాచ్‌మెన్‌కు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వమని చెప్పేవాన్ని అన్నారు.

    పవర్ ఫుల్ స్టార్‌గా ఎదిగారు...

    పవర్ ఫుల్ స్టార్‌గా ఎదిగారు...


    పరిశ్రమలో నేను ఎవరి ఆడియో వేడుక కోసమైనా ఎదురు చూస్తున్నానంటూ అది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడియో కోసమే. ఆయన సాంగ్స్ వెరైటీగా డిజైన్ చేయిస్తారు. చిరంజీవిగారు సాంగ్స్‌కి కొత్త నిర్వచనం చెప్పి కొత్త రూట్ లోకి తీసుకెళితే...ఆ ఫ్యామిలీ నుండి వచ్చి ఆ రూట్‍‌లో వెళ్లకుండా కొత్త పాత్‌ని క్రియేట్ చేసుకుని కొత్త నిర్వచనం చెప్పి సునామీ లాంటి పవర్ ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇది సమాన్య విషయం కాదు.

    ఆయనంటే గౌరవంతో కూడిన భయం...

    ఆయనంటే గౌరవంతో కూడిన భయం...


    మహానుబావులు మనకేమీ సత్యాలు చెప్పరు. వారి జీవన విధానం నుండి మనం నేర్చుకోవాలంతే. స్వర్గీయ ఎన్టీఆర్ గారి నుండి హార్డ్ వర్క్, డెడికేషన్, మడమతిప్పనితనం నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ నుండి నమ్మకం నేర్చుకున్నాను. ఆయన చేసే ప్రతి పనిని ప్రేమిస్తారు. లేకుంటే ఆ పని చేయరు. నిజాయితీగా నడుచుకోవడం, పెద్ద లక్ష్యాన్నైనా సాధించగలమనే నమ్మకం కలిగి ఉండటం. చేసే పనిని ప్రేమించడం, నిస్వార్థంగా సాయం చేయడం. అదే హ్యూమనిజం. అదే పవనిజం. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం...గౌరవంతో కూడిన భయం' అని చెప్పుకొచ్చారు వైవిఎస్ చౌదరి.

    రేయ్

    రేయ్


    మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రేయ్'. ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవ్వడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు.

    English summary
    YVS Chowdary says, Two people who inspire me in film industry NTR & Pawan Kalyan. Pawan Kalyan was the cynosure of all eyes at the music launch of his nephew Sai Dharam Tej-starrer Rey. The actor was in seen in cheerful mood greeting everyone and exchanging pleasantries with his industry colleagues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X