మంచి అవయవ సంపద.. సిగ్గులేకుండా అడిగేశాను.. అనుష్కపై దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్
దక్షిణాది సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి గురించి తెలియని వారెవరూ ఉండరు. మరీ ముఖ్యంగా తెలుగు నాట అయితే అనుష్కకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదహారణాల తెలుగమ్మాయిల కనిపించే అనుష్కకు స్టార్ స్టేటస్ కల్పించింది టాలీవుడ్. నటిగా పదిహేనెళ్లు పూర్తి చేసుకున్న అనుష్కకు టాలీవుడ్ మొత్తం శుభాకాంక్షలు తెలిపింది.

స్పెషల్ ఈవెంట్..
అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే అనుష్కకు నటిగా పదిహేనెళ్లు నిండిన సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది నిశ్శబ్దం యూనిట్. ఈ వేడుకలో అనుష్కతో పని చేసిన దర్శకదిగ్గజాలందరూ పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్‌తో మొదలుకొని.. హేమంత్ మధుకర్ వరకు అందరూ అనుష్క గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అందులో భాగంగా వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

అనుష్కతో ఒక్క మగాడు..
వైవీఎస్ చౌదరి-అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒక్కమగాడు. ఈ మూవీ షూటింగ్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. తాను పరిచయం చేసిన నటీనటులను తప్పా మిగతా వారందరినీ గారు అని పిలుస్తానని, అలాగే ఒక్క మగాడు సినిమా టైమ్‌లో అనుష్క గారు, స్వీటీ గారు, అనుష్క జీ అంటూ పిలిచానని చెప్పుకొచ్చాడు.

మంచి అవయవ సంపద..
తాను దేవదాస్ మూవీ కోసం ఇలియానాతో మాట్లాడటాకి ముంబై వెళ్లానని చెప్పుకొచ్చాడు. అంతా ఓకే అయ్యాక ఇలియానా, వాళ్ల అమ్మ, తాను ఫ్లైట్‌లో హైద్రాబాద్ వస్తున్నామని తెలిపాడు. ఆ సమయంలో మంచి అవయవ సంపద, అవయవ సౌష్టవం, మంచి అవయవ పొందికతో ఉన్న ఓ అమ్మాయి కనబడిందని వివరించుకుంటూ వచ్చాడు.

సిగ్గులేకుండా అడిగాను..
అయితే తాను ముందు ఉండటం వల్ల సరిగా కనబడట్లేదని, లేచి ఓ రెండు మూడు స్లారు అటు ఇటూ నడిచానని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి తన మొహం చూశాక.. మొహమాటపడకుండా, సిగ్గు పడకుండా సినిమాల్లో నటిస్తారా? అని అడిగానని తెలిపాడు. సినిమాల్లొ నటించాడనికే వెళ్తున్నానని, అన్నపూర్ణ స్టూడియోస్, పూరీ జగన్నాథ్ సినిమా అంటూ అనుష్క చెప్పిందని తెలిపాడు.


Click it and Unblock the Notifications











