పవన్ కళ్యాణ్ నా మీద ఉంచిన నమ్మకాన్ని...
హైదరాబాద్: చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రేయ్'. 'షౌట్ ఫర్ సక్సెస్' అనేది ఉపశీర్షిక. ప్రముఖ నటి షబానాఆజ్మీ మేనకోడలు సయామీఖేర్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. శ్రద్ధాదాస్ ముఖ్య భూమిక పోషిస్తోంది. వై.వి.ఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
దర్శకనిర్మాత చౌదరి మాట్లాడుతూ ''ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. కథానుసారం అమెరికా, వెస్టిండీస్‌ల్లో చిత్రీకరణ జరిపాం. సాయి ధర్మతేజ్ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేసేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాను. రెండు పాటలు, కొన్ని పోరాట సన్నివేశాలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
చిరంజీవి, రాధ కాంబినేషన్ లో రూపొంది సూపర్ హిట్టైన సాంగ్ ''గోలీమార్... కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో''. ఈ పాటకు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్టెప్స్ వేయనున్నాడు. ఈ పాట రీమిక్స్ వెర్షన్ ని 'రేయ్'లో వాడుతున్నారు. ఈ సెన్సేషనల్ హిట్ సాంగ్ లో చిరంజీవి, రాధ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఆ పాటను ఇప్పుడు రీ-మిక్స్ చేసి 'రేయ్'లో పెడుతూండటంతో అంతటా క్రేజ్ క్రియేట్ అవుతోంది.
సినిమా కథాంశం గురించి చెబుతూ, 'ఆరేబియన్ దీవుల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన కొందరు యువకులు హీరోతో జట్టుగా 'రేయ్' అనే బ్యాండ్ స్థాపించి అమెరికా వెళతారు. ఇది మ్యూజికల్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఉంటుంది అన్నారు. తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, నరేష్, అలీ, రఘుబాబు, వేణుమాధవ్, హేమ, యలమంచిలి యుక్త తదితరులు నటిస్తున్నారు. సంగీతం: చక్రి, పాటలు: చంద్రబోస్, ఛాయాగ్రహణం: గుణశేఖరన్, సమర్పణ: యలమంచిలి గీత.


Click it and Unblock the Notifications












