దాంట్లో కొంత నిజముంది: వైవియస్ చౌదరి
గుణ శేఖర్ .. చాలా రోజులు షూటింగ్ జరుపుతాడన్నదన్న దాంట్లో కొంత నిజం ఉంది. ఎలాగంటే.. చార్మినార్‌లో షూటింగ్ చేయాలంటే... సాధ్యపడదు. కథప్రకారం దానికి సెట్‌వేయాలి. అందుకు 2 నెలలు టైమ్ పడుతుంది. ఆ తర్వాత షూటింగ్ చేశాక.. దాన్ని మోడిఫికేషన్ చేయాలి. అందుకు రెండు నెలలుపడుతుంది. దీంతో హీరో డేట్స్ మరో సినిమాకు ఉపయోగించు కుంటాడు. ఆ రకంగా ఆలస్యం మినహా ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. గుణశేఖర్ 24 క్రాఫ్ట్‌ల గురించి బాగా తెలసిన వ్యక్తి. ఇక గుణశేఖర్ సినిమాలంటే..భారీ ఎత్తున సెట్టింగ్స్ వేసి ఖర్చు చేయిస్తాడనేది అపవాదు మాత్రమే అన్నారు. రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్‌లో తాను నిర్మాతగా 'నిప్పు'లాంటి సినిమా తీస్తున్నారు వైవిఎస్ చౌదరి. యలమంచిలి గీత సమర్పణలో రవితేజ, దీక్షాసేథ్ జంటగా బొమ్మరిల్లు పతాకంపై నిర్మించిన ఐదవ చిత్రమిది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.
అలాగే...టైటిల్ గురించి మాట్లాడుతూ...మొదట ఈ సినిమాకు 'కత్తి' అనుకున్నాం. దాన్ని దర్శకుడు గుణశేఖర్ డీల్ చేశారు. ఆ టైటిల్ దొరక్కపోవడంతో...'నిప్పు' అనే టైటిల్ ఆయనే పెట్టారు. దీంతో.. దానికంటే ఇదే బాగుందనిపించింది. అనుకున్నట్లుగా చిత్రాన్ని గుణశేఖర్ తీశారు. గతనెలలోనే సినిమాను చూశాను. చాలా నమ్మకం ఏర్పడింది. ఏ సినిమా కూడా అనుకున్నట్టుగా పూర్తిగాదు. బడ్జెట్ విషయంలో అటూ ఇటూగా ఉంటుంది. ఏ విషయంలోనే గుణశేఖర్ ఇబ్బంది పెట్టకుండా చిత్రాన్ని తీశాడు అని చెప్పుకొచ్చారు. దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, శ్రీరాం, కృష్ణుడు, బ్రహ్మాజీ, సుప్రీత్, ప్రదీప్‌రావత్, ప్రగతి ఇతర పాత్రధారులు. ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: ఆనంద్ సాయి, కూర్పు: గౌతమ్‌రాజు, మాటలు: ఆకుల శివ, శ్రీధర్ సీపాన, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యస్.ఆర్.కిషోర్, సహ నిర్మాతలు: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్త, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











