ఆవిడ అందాల కోసం వైవిఎస్ చౌదరి డబుల్ టాక్స్!?
రవితేజ, దీక్షసేథ్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నిప్పు'. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈచిత్రాన్ని నిర్మాత వైవిఎస్ చౌదరి ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈచిత్రానికి సంబంధించి ఓ అంశం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దీక్షాసేథ్ కాస్త ఎక్కువగానే అందాల ఆరబోసిందని, ఈ హీరోయిన్ గ్లామర్ కు కలెక్షన్ల వర్షం కురుస్తుందనే నమ్మకంతో వైవిఎస్ డబుల్ టాక్స్ చెల్లించడానికి సిద్ధమయ్యాడని అంటున్నారు.
దీక్ష సేథ్ అందాలకు, డబుల్ టాక్స్ కట్టడానికి కారణం ఏమిటా...? అని ఆరా తీస్తే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డువారు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. యు/ఎ సర్టిపికెట్ ఉంటే చిత్రానికి 14 శాతం టాక్స్ చెల్లించాలట. అదే క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఉంటే కేవలం 7 శాతం మాత్రమే టాక్సు చెల్లించాలి.
క్లీన్ 'యు' సర్టిఫికెట్ రావాలంటే....శృంగార భరిత హాట్ సీన్లు ఉండటానికి వీల్లేదు. సినిమాలో ఆ మసాలా లేకుంటే బి, సి సెంటర్ల ప్రేక్షకులు, ముఖ్యంగా రవితేజకు ఉండే మాస్ ఫాలోయింగ్ సంతృప్తి చెందదని, అందుకే దీక్షాసేథ్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్ పై ఉన్న నమ్మకంతో వైవిఎస్ డబుల్ టాక్స్ చెల్లించడానికి సిద్ధం అయ్యాడని చర్చించుకుంటున్నారు. మరి వైవిఎస్ నమ్మకం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











