‘నిప్పు’తో చెలగాటమాడుతున్న ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్స్..?
వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఇద్దరు ప్రముఖ దర్శకులు ఒక్కటయ్యారు. అమీ తుమీ తేల్చుకోవడానికి నడుం కట్టారు. అయితే ఒకరు డైరెక్టర్ గా, మరొక్కరు ప్రొడ్యూసర్ గా రంగంలోకి దిగుతున్నారు. హిట్ కోసం మొహం వాచిన వీరిద్దరికీ హిట్ ఇవ్వగల ఒకే ఒక్కడు రవితేజ అనుకున్నారు. అందుకే అతనితో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. వారిలో ఒకరు గుణశేఖర్, దర్శకుడుకాగా, మరో డైరెక్టర్ వైవియస్ చౌదరి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
ఈ చిత్రానికి 'నిప్పు" అనే టైటిల్ అనుకున్నట్టు ముందుగానే వార్తలు వచ్చాయి. అయితే అఫిషియల్ గా ఈ రోజు (23.05.11) అనౌన్స్ చేశారు. దీని కోసం ఒక ప్రేస్ మీట్ ని కండక్ట్ చేసి ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయబోతున్నారు. మొదట గుణశేఖర్ ఈ చిత్రానికి కత్తి అనే టైటిల్ అనుకొన్నారు. అయితే ఈ టైటిల్ ని కళ్యాణ్ రామ్ సినిమాకు పెట్టడంతో తర్వాత ఇప్పుడు కొత్తగా నిప్పు అని కన్ఫం చేశారు.


Click it and Unblock the Notifications











