మళ్లీ వార్తల్లో... మెగా మేనల్లుడి ‘రేయ్’
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'రేయ్' చిత్రం చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లోకెక్కింది. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అప్పుడెప్పుడో 2010లో ప్రారంభైమన ఈ చిత్రం ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. ఈ సినిమాను పక్కనపెట్టిన వైవిఎస్ రవితేజతో 'నిప్పు' సినిమా తీసి తీవ్రంగా నష్టపోయాడు.
ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికి పోయిన వైవిఎస్....'రేయ్' చిత్రం నిర్మించలేని పరిస్థితుల్లో పడ్డాడని, విషయం మెగాస్టార్ వరకు వెళ్లి ఓ పీఆర్పీ ఎమ్మేల్యేకు చెప్పి నిధులు సమకూర్చే ఏర్పాటు చేశాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే సదరు ఎమ్మెల్యే మొండి చేయి ఇచ్చాడని, చివరకు వైవిఎస్ ఈ చిత్రాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్లు పుకార్లు సైతం వినిపించాయి.
అయితే ఈ ప్రచారన్నంతటికీ పటాపంచలు చేస్తూ తాజాగా మరో వార్త వినిపిస్తోంది. ఈ సినిమా రద్దు కాలేదని, త్వరలో షూటింగ్ నిమిత్తం ఈచిత్ర యూనిట్ అమెరికా వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది.
ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన కొంత భాగాన్ని లాస్ వెగాస్, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించారు. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2012 చివరికల్లా వైవిఎస్ ఈచిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











