ఇంట్రర్వెల్ బ్యాంగ్ అదురుతుంది..వైవియస్ చౌదరి

By Srikanya

'సలీమ్‌' కొత్త తరహా ప్రేమకథతో రూపొందిస్తున్న చిత్రం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. నేను తయారు చేసుకున్న కథకు కచ్చితంగా సరిపోయే హీరో విష్ణు అంటూ దర్శకుడు వైవియస్ చౌదరి సలీం ఆడియో ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు. మంచు విష్ణు, ఇలియానా నాయకా నాయికలుగా వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, రిలయన్స్‌ బిగ్‌ సినిమా పతాకాలపై పద్మశ్రీ డాక్టర్‌ మోహన్‌ బాబు ఎం. నిర్మిస్తున్న 'సలీమ్‌' (దుమ్ము రేపుతాడు) చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది.

ఈ చిత్రం ఆడియో సిడిలను ప్రముఖ దర్శకుడు డాక్టర్‌ దాసరి నారాయణరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావుకు అందించారు. సందీప్‌ చౌతా సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను సోనీ మ్యూజిక్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఒక పాటకు విష్ణు నర్తించారు. మోహన్‌బాబు, రఘుబాబు ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని అభినయించారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం యూనిట్‌ మొత్తం ఎంతో శ్రమించి పనిచేసింది. దానికి తగ్గ ప్రతిఫలాన్ని అందరం పొందుతామన్న నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. మా సంస్థలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. మా 'సలీమ్‌'కు అద్భుతమైన సంగీతం కుదిరింది' అన్నారు.

విష్ణు మాట్లాడుతూ, 'అనేక కారణాల వల్ల మా చిత్ర నిర్మాణం ఆలస్యమైనప్పటికీ మంచి విజయాన్ని సాధించే చిత్రాన్ని నిర్మించడం సంతోషాన్ని కలిగిస్తోంది. 'సలీమ్‌' ఆడియో 2009లో ది బెస్ట్‌ ఆడియో అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ చిత్రం ఆడియో వేడుక విజయవాడలో జరపాల్సింది. శతదినోత్సవం అక్కడ జరుపుతాం. మా యూనిట్‌కు కృతజ్ఞతలు' అన్నారు.

డాక్టర్‌ దాసరి నారాయణరావు మాట్లాడుతూ, "ప్రతిజ్ఞ'తో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించిన మోహన్‌ బాబు నిర్మిస్తున్న 53వ చిత్రమిది. మోహన్‌బాబు గుండె ధైర్యంతో సినిమాలు తీశారు. 'సలీమ్‌' అరుదైన కలయికతో రూపొందుతున్న చిత్రం. పర్‌ఫెక్షన్‌తో సినిమాలు రూపొందించే వైవిఎస్ చౌదరి, ఆర్గనైజేషన్‌లో ప్రథమస్థానంలో ఉండే మోహన్‌బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే 'సలీమ్‌' చరిత్రలో నిలిచిపోయే స్థాయి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X