రవితేజ ‘నిప్పు’లో మెలోడ్రామా
రవితేజ హీరోగా గుణశేఖర్ దర్సకత్వంలో వైవియస్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'నిప్పు". దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి పతాకంపై వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్నారు. 65శాతం చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి మాట్లాడుతూ ''ఆగస్టులో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించాం. 35శాతం బ్యాలెన్స్ మిగులుంది. నవంబర్ చివరినాటికి పూర్తిచేసి డిసెంబర్‌లో నిర్మాణానంతర పనులు చేస్తాం. సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేస్తాం. పక్కా ప్రణాళికతో అన్నిటా..స్పష్టంగా ముందుకెళుతున్నాం. దర్శకుడు చక్కగా తెరకెక్కిస్తున్నారు.
అద్భుతమైన కామెడీ, కథాబలంతో రవితేజ పంథాలో ఉండే సినిమా ఇది. రవితేజను కొత్తగా ఆవిష్కరిస్తున్నాం. హైదరాబాద్, పొలాచ్చి తదితరచోట్ల కీలకసన్నివేశాలు, పాటలు చిత్రీకరించాం. అలాగే విశ్రాంతికి ముందు వచ్చే ఛేజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్. పొడుగుకాళ్ల సుం దరి దీక్ష సినిమాకి అస్సెట్. రామో జీఫిల్మ్‌సిటీలో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. తదుపరి సౌదీ అరేబియాలో 12రోజుల చిత్రీకరణకు వెళుతున్నాం. తమన్ 3పాటలకు రికార్డింగ్ చేశారు. రెండిటిని తెరకెక్కించాం. కథాబలమున్న మెలోడ్రామాలన్నీ విజయం సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది""అన్నారు.


Click it and Unblock the Notifications











