దర్శక నిర్మాత వైవియస్ చౌదరి రామ్ అనే కొత్త హీరోను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. రామ్ సరసన నటించేందుకు కొత్త హీరోయిన్ కోసం ఆయన అన్వేషిస్తున్నారు. ఈ సినిమాను ఎన్నారైలు నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రేమ ఇతివృత్తంతో నిర్మాణమయ్యే ఈ సినిమా షూటింగ్ ఈ వేసవిలో అమెరికాలో జరుగుతుంది. 70 శాతం సినిమా నిర్మాణం అమెరికాలోనే జరుగుతుందట. ఈ సినిమాకు రే అనే పేరు పెట్టాలని అనుకుంటున్నారట. బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్క మగాడు అనుకున్నంత విజయం సాధించకపోవడాన్ని పక్కన పెట్టి వైవియస్ చౌదరి ఈ కొత్త సినిమాపై తన దృష్టిని కేంద్రీకరించారట.