అయ్య బాబోయ్ వైవియస్ సినిమానా...పారిపోండి..!
'ఒక్కమగాడు" చిత్రంతో దర్శకుడిగా తన స్థాయిని దిగజార్చుకున్న వైవీఎస్ చౌదరి, 'సలీం" తో మరో మారో దర్శకుడిగా తనకు తానే మరో ఝలక్ ఇచ్చుకున్నాడు. ఒక్కప్పుడు కమర్షియల్ డైరెక్టర్ గా ఓ రేంజ్ కి ఎదిగిన వైవియస్ చౌదరి, 'ఒక్కమగాడు" తో 'చెత్త డైరెక్టర్" అనిపించుకున్న సంగతి విదితమే.
బాలయ్య అభిమానులు బోల్డన్ని ఆశలు పెట్టుకున్న 'ఒక్కమగాడు" కాస్తా చెత్త చిత్రంగా తొలిరోజే డిక్లేర్ అయిపోవడంతో, ఆగ్రహించిన అభిమానులు అప్పట్లో వైవియస్ చౌదరి కార్యాలయం పై దాడులకు దిగారు. ఇప్పుడు విష్ణుకి పెద్దగా అభిమాన గణం లేకపోవడంతో తప్పించుకున్న వైవియస్ చౌదరి, దర్శకుడిగా బోల్డన్ని విమర్శల్నే ఎదుర్కోవాల్సి వస్తోంది. 'వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్" అంటూ రివ్వూల్లో హెచ్చరికలు దర్శనమివ్వడం చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు 'సలీం" తో వైవియస్ చౌదరి ప్రేక్షకుల్ని ఎంతగా బెదరగొట్టాడో.!
More from Filmibeat
సలీం విష్ణు ఇలియానా వైవియస్ చౌదరి బాలయ్య ఒక్కమగాడు saleem vishnu ileana yvs chowdary balakrishna okka magaadu


Click it and Unblock the Notifications











