'ఢీ' తో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు కి మరో మంచి అవకాశం వై.వి.యస్.చౌదిరి రూపంలో తలుపు తడుతోంది. నిజానికి వై.వి.యస్' రేయ్ 'సినిమాతో బిజీగా ఉండాలి. కాని రామ్ అటు యమ్.యస్.రాజు.. దర్శకుడు బి.గోపాల్ తో చేస్తున్న సినిమాలో బుక్కయ్యాడు.అంతేగాక.. శ్రీనువైట్ల సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దాంతో రామ్ డేట్స్ డైలమాలో పడ్డ చౌదిరి విష్ణు సినిమా డిస్కషన్స్ బిజీగా ఉంటున్నాడట. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుందిట . 'ఒక్క మగాడు' పరాజయం చౌదరిని,'కష్ణార్జున' పరాజయం విష్ణుని చాలా జాగ్రత్తగా ముందడగు వేసేలా చేస్తోందిట. దాంతో కథ దగ్గరనుండి అన్ని విషయాలు ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నాకే రంగం లోకి దిగుదామనే ఆలోచనలో ఉన్నారట. అంటే త్వరలో మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాబోతోందన్నమాట.