వై.వి.యస్.చౌదిరి సేఫ్ గేమ్...

ఒక సారి హిట్టయిన కాంబినేషన్ అంటే అందరికీ క్రేజే. అందులోనూ వారిని పరిచయం చేసిన డైరక్టర్ కి మరీ మోజుంటుంది. దాన్నే ఇప్పుడు దర్శకుడు వైవిఎస్ చౌదరి క్యాష్ చేసుకోబోతున్నాడు. ఆయన రూపొందించిన 'దేవదాసు' సినిమాతో పరిచయమైన రామ్, ఇలియానా.. ఇద్దరూ క్రేజీ స్టార్స్‌గా పేరు తెచ్చుకుని వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా రెండేళ్ల కాలంలోనే ఇలియానా తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారగా ఎదిగింది. అలాగే రామ్ రెండో సినిమా 'జగడం' ఫ్లాపయినా ఇంకా అతడికి ఆ క్రేజ్ అలానే నిలిచే వుంది. ఇక ఈ నెలలోనే రానున్న 'రెడీ'తో అతను మరింత క్రేజ్ సంపాదించుకుండాని అందరూ భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.అంటే మరో సారి దేవదాసు ప్రేక్షకులకు కనువిందు చెయ్యనున్నాడన్నమాట.


Click it and Unblock the Notifications











