అసభ్య ప్రవర్తన: మమ్మల్ని కాపాడేది ఎవరు? ఏడ్చేసిన ‘దంగల్’ నటి!
Recommended Video

'దంగల్' సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న జైరా వాసిమ్ ఇటీవల విడుదలైన 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ నటి తాజాగా విమాన ప్రయాణంలో దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
జైరా వాసిమ్ పట్ల అసభ్య ప్రవర్తన
ఢిల్లీ నుంచి ముంబైకి విస్తారా విమానంలో ప్రయాణించిన జైరా వాసిమ్ పట్ల వెనక సీటులో కూర్చున వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు, తోటి ప్రయాణీకులు కూడా ఆమెకు ఈ విషయంలో సహాయ పడలేదు.
కాళ్లు పెట్టి, అసభ్యంగా తాకుతూ
తన వెనక సీటులో కూర్చున్న మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి, తన మెడను అసభ్యంగా తాకుతూ, వీపును రుద్దుతూ అసభ్యంగా ప్రవర్తించాడని, తాను చేయి పెట్టుకునే చోట కాళ్లు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని, ఇతడి ప్రవర్తనపై ప్లైట్ సిబ్బందికి కంప్లైంట్ చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, ఏ ఆడపిల్లకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని జైరా వాసిమ్ వాపోయారు.

మమ్మల్ని కాపాడేది ఎవరు?
ఎందుకు ఇలా చేస్తున్నావని తాను ప్రశ్నిస్తే.... విమానం కుదుపుల వల్ల అలా పెట్టానని వాదించాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలను కాపాడేది ఎవరు? ఎవరికి వారే సహాయం చేసుకునేలా అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా జైరా వాసిమ్ సూచించారు.

కన్నీళ్లు పెట్టుకుంటూ....
తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని జైరా వాసిమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో రూపంలో వెల్లడించారు. జైరా వాసిమ్ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. విస్తారా విమాన సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











